Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన హైదరాబాద్

Hyderabad Became a Shelter for Terrorists

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాలకు చెందిన వారు వేల సంఖ్యలో హైదరాబాద్‌లో ఉంటున్నారని, పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్రమ చొరబాటుదారులను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కూడా ఎన్‌ఆర్‌సి చట్టాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. ఒబిసి కమిషన్‌కు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే బిసిల్లో వర్గీకరణ చేపడుతుందన్నారు. ఈనెల 23న గద్వాల్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, సెప్టెంబర్ మాసంలో రెండో దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో బలమైన శక్తిగా బిజెపి ఎదుగుతుందని ఆయన చెప్పారు.

Comments

comments