Home రంగారెడ్డి శరవేగంగా…హైవే పనులు

శరవేగంగా…హైవే పనులు

 Hyderabad Bijapur  Highway Works

హైదరాబాద్- బీజాపూర్ అంతర్‌రాష్ట్ర రహదారి మూడు లైన్ల రహదారిగా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పరిగి ఆర్‌అండ్‌బి పరిధిలోని మన్నెగూడ నుంచి కర్నాటక సరిహద్దు రావులపల్లి వరకు ఉన్న ఈ రోడ్డు నేషనల్ హైవే వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా పరిగి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న హైవే రోడ్డు కల నెరవేరనుంది.  మన్నెగూడ నుంచి కర్నాటక సరిహద్ద్దు రావులపల్లి వరకు రోడ్డు పనులు ఏడు నెలలుగా చురు కొన్నేళ్లుగా పరిగి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తు న్న హైవే రోడ్డు కల నెరవేరనుంది. మన్నెగూడ నుంచి క ర్నాటక సరిహద్ద్దు రావులపల్లి వరకు రోడ్డు పనులు ఏడు నెలలుగా చురుకుగా కొనసాగుతున్నాయి. పరిగి డివిజ న్ పరిధిలోని మన్నెగూడ నుంచి పరిగి వరకు రెండు వైపులా ల్యాండ్ ఆక్యుపేషన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రోడ్డు పక్కన పెద్ద పెద్ద ఇటాచితో భూమిని చదును చేసి మట్టిని పోసి మెటలింగ్ పనులు చేపట్టి బీటీ రోడ్డు పనులు పూర్తి చేస్తున్నారు. రెండునెలలుగా పరిగి పట్టణంలో కూడా రోడ్డు నుంచి వంద మీటర్ల దూరంలో ఇళ్ల, దుకాణాలకు కూడా మార్కింగ్ ఇచ్చి రోడ్డు, సైడ్ డ్రైన్ పనులు కూడా శర వేగంగా కొనసాగుతున్నాయి. పరిగి పట్టణంలోని బాసీద్ ఫంక్షన్ హాల్ నుంచి టెలిఫో న్ ఎక్చైంజ్ ముందు నుంచి అంబేద్కర్ విగ్రహం, బస్టాం డ్, బాహర్‌పేట్, కోడంగల్ చౌరస్తా, హెచ్‌పి పెట్రోల్ బం కు వరకు రోడ్డుకు అవసరమైన స్థలంలో నిర్మాణాలు ఉ న్న చోట్లలో మార్కింగ్ ఇచ్చి సైడ్ డ్రైన్ పనులు పూర్తి చేశా రు. అంతేకాకుండా రోడ్డు మలుపులు వద్ద కూడా రోడ్డు కు ఎంత పొలం అవసరమో అక్కడి వరకు మార్కింగ్ ల్యాండ్ ఆక్యుపెన్సీ చేశారు. రోడ్డుకు కావాల్సిన స్థలాన్ని ఆక్యుపెన్సీ చేసిన చోట పరిగి సర్వేయర్, వీఆర్‌ఓలతో కలిసి సర్వే చేయించారు.
రూ.260 కోట్లతో 72.05 కిలోమీటర్ల హైవే రోడ్డు….
మన్నెగూడ నుంచి పూడూరు మండలం మీదుగా పరిగి, గడిసింగాపూర్, కోడంగల్ మీదుగా కర్నాటక సరిహద్దు రావులపల్లి వరకు ఈ హైవే రోడ్డు పనులు నేషనల్ హైవే వారు నిర్వహిస్తున్నారు. మ న్నెగూడ నుంచి కర్నాటక సరిహద్దు వరకు 72.05 కిలోమీటర్ల వరకు నాలుగు లైన్ల రహదారి పనులు శర వేగంగా పూర్తి చేస్తున్నారు. మొత్తం మన్నెగూడ నుంచి కర్నాటక సరిహద్దు వరకు రోడ్డు వేసేందుకు రూ.320 కోట్లు మంజూరవగా అందు లో రూ.260 కోట్లతో రోడ్డు వేసేందుకు, రూ. 60 రోడ్డు వేసేందుకు రోడ్డుకు ఇరుపక్కల భూములు, స్థలాలు పోయిన వారికి పరిహారం కింద ఇవ్వనున్నట్లు సమాచారం. రోడ్డు పూర్తిగా 100 ఫీట్లు ఉండగా అటు వైపు 50, ఇటు వైపు 50 ఫీట్లతో మూడు లైన్ల రహదారి పనులు నడుస్తున్నాయి.
రోడ్డు ఇరువైపుల 5 ఫీట్ల డ్రైన్ పనులు ప్రారంభమై పూర్తి కావొచ్చాయి….
పరిగి పట్టణంలోని భవాణీ హోటల్ వద్ద హైవే రోడ్డుకు ఒక వైపు డ్రైన్ పనులు కూడా ప్రారంభించారు. ఈ డ్రైన్ కూడా రోడ్డుకు ఇటు 50 ఫీట్లు వదిలి 5 ఫీట్ల వెడల్పు, 5 ఫీట్ల ఎత్తులో డ్రైన్ పనులు కూడా ప్రారంభించారు. భవాణీ హోటల్ పక్క నుంచి ఈ డ్రైన్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇక పరిగి పట్టణంలో మార్కింగ్ ఇచ్చిన చోట్లలో కూలగొట్టి డ్రైన్ పనులు ప్రారంభించి పూర్తి చేస్తున్నారు. రోడ్డును మలుపులు లేకుండా నిటారుగా చేసేందుకు రోడ్డు సెంటర్‌ను జరిపి పనులు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని కొంత మంది ప్లాట్లలో డ్రైన్ పనులు నిర్వహిస్తున్నారు. ప్లాట్ల యజమానులకు డ్రైన్‌లో పోయిన స్థలానికి డబ్బులు పరిహారం కింద ఇచ్చేందుకు హామీ ఇవ్వడంతో పనులు కొనసాగించేందుకు వారు ఒప్పుకున్నారు. రోడ్డు స్థలాన్ని ఆక్రమిస్తూ కట్టిన ఇళ్లను, మెట్లను కూడా తొలగించి డ్రైన్, రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పట్టణంలో హైవే రోడ్డుకు ఇరుపక్కల సైడ్ డ్రైన్ పనులు నిర్వహించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో 10 నెలల్లో పట్టణంలో రోడ్డు సైడ్ డ్రైన్ పనులు పూర్తి కానున్నాయి.