Home తాజా వార్తలు హైదరాబాద్‌ పగ్గాలు రాయుడికి

హైదరాబాద్‌ పగ్గాలు రాయుడికి

Hyderabad captaincy to Amabati Rayudu
హైదరాబాద్‌: ఈ నెల 14 నుంచి 25 వరకు బెంగళూరులో జరగనున్న విజయ్‌ హజారే ట్రోఫీ(నాకౌట్)లో భాగంగా హెచ్‌సిఎ హైదరాబాద్‌ సీనియర్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అంబటి రాయుడుకు అప్పగించింది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును హెచ్‌సిఎ బుధవారం ఎంపిక చేసింది. ఈ జట్టులో అక్షత్‌, తన్మయ్‌, సుమంత్‌ తదితరులకు చోటు దక్కింది. ఇక ఇటీవల రాయుడు తన ప్రదర్శనతో తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఆసియా కప్ లో కూడా ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ లో పదో సీజన్ వరకు ముంబయి ఇండియన్స్ కు ఆడిన రాయుడు పదకొండో సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. రెండేళ్ల నిషేధం తరువాత బరిలోకి దిగిన చెన్నై చాంపియన్ గా అవతరించింది. చెన్నై ఐపిఎల్ 11 టైటిల్ గెలవడంలో రాయుడు పాత్ర ఉంది.
హైదరాబాద్‌ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్‌), అక్షత్‌రెడ్డి, తన్మయ్‌ అగర్వాల్‌, రోహిత్‌ రాయుడు, సుమంత్‌, సందీప్‌ (వికెట్‌కీపర్‌), మెహ్దీ హసన్‌, రవికిరణ్‌, సాకేత్‌ సాయిరామ్‌, సివి మిలింద్‌, ఆకాశ్‌ భండారి, రవితేజ, తనయ్‌ త్యాగరాజన్‌, ముదాసిర్‌ హుస్సేన్‌, అజయ్‌దేవ్‌ గౌడ్‌.

Hyderabad captaincy to Amabati Rayudu.