Home తాజా వార్తలు హైదరాబాద్‌ను బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రంగా మారుస్తాం…

హైదరాబాద్‌ను బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రంగా మారుస్తాం…

KTR

హైదరాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతామని కెటిఆర్ తెలిపారు. హెచ్‌ఐసిసిలో అంతర్జాతీయ బ్లాక్ చైన్ కాంగ్రెస్ ఐటి నిపుణుల సదస్సు జరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల్లో ప్రైవేట్ కంపెనీలు ఈ టెక్నాలజీనే వాడుతున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ధ్రువపత్రాలు బ్లాక్ చైన్ సర్వర్‌లో పెడతామని చెప్పారు. ఉద్యోగమిచ్చే కంపెనీలు అభ్యర్థుల ధ్రువపత్రాలు సరిచూసుకోవచ్చని తెలియజేశారు. హైదరాబాద్‌ను బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రంగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్, ఐటి సంస్థల నిపుణులు, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.