Home తాజా వార్తలు అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం

illegal-money

మన తెలంగాణ/సిటీబ్యూరో హైదరాబాద్/ : ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 70 లక్షలు తరలిస్తున్న ఓ వ్యక్తి నుంచి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకఖరుల సమావేశంలో కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీసులు కమిషనరేట్ పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించామన్నారు. రామకృష్ణపురం చెక్‌పోస్ట్ వద్ద నేరేడ్‌మెట్ పోలీసులకు చంద్రకాంత్ వర్మ అనే వ్యక్తి దగ్గర ఎటువంటి లెక్కలేకుండా తరలిస్తున్న రూ. 70లక్షల రూపాయల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతను జూబ్లిహిల్స్ లోని డైమండ్ జూవెల్లర్స్‌లో పనిచేస్తున్నాడని ఈ సొమ్మును ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని రాయపూరి నుంచి తరలిస్తుండగా పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉండటంతో రూ. 50వేల రూపాయలకు పైన ఎవరు డబ్బులు తరలిస్తున్న దానికి సరైన లెక్క చూపకపోతే దానిని వాటిని స్వాధీనం చేసుకుంటామని ఆ సొమ్మును ఇన్‌కాంటాక్స్ డిపార్టెంట్ కు అప్పచెప్పుతామని ఆయన తెలిపారు.
నాచారం పోలీసులకు చిక్కిన సూడో నక్సలైట్
నాచారం పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లోని ఒక వైన్ షాపు యజమాని దయాకర్ రెడ్డికి ఫోన్లో ఒక వ్యక్తి తనను తాను నక్సలైట్‌గా పరిచయం చేసుకొని తన పేరు సుధాకర్ అన్న అని పేర్కొంటూ వెంటనే రూ. 20లక్షల రూపాయలను ఇవ్వాలని లేకపోతే చంపేస్తానంటూ తెలపడంతో భయపడ్డ బాధితుడు దయాకర్‌రెడ్డి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన నాచారం పోలీసులు మల్కాజిగిరి ఎస్‌వోటి సహాయంతో నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను మల్లాపూర్‌లో నివసించే భూక్యాకృష్ణా నాయక్ అలియాస్ కిట్టుగా తెలిసింది. ఇతనికి ఇంతకుముందే నేరచరిత కలిగిన వ్యక్తి కావడంతో అతనిపై రౌడి షీట్‌ని తెరుస్తామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు.

hyderabad Police Seized illegal money Transfer