Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

Road Accident

 

న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం చెందాడు. నార్త్ కరోలినాలో బొంగుల సాహిత్ రెడ్డి బుధవారం ఉదయం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అమెరికాలో ఎంఎస్ చదువడానికి సాహిత్ రెడ్డి వెళ్లాడు. తన కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కోరారు. విద్యానగర్ లోని పద్మా కాలనీలో మధుసూదన్ రెడ్డి, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు సాహిత్.