Home వార్తలు ఉగ్ర గ్యాంగ్‌లో హైదరాబాదీ

ఉగ్ర గ్యాంగ్‌లో హైదరాబాదీ

charminar

ముంబాయిలో యన్‌ఐఏకు పట్టుబడ్డ అసదుల్లా లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడు
2012 నుంచి దుబాయ్‌లో తలదాచుకుంటున్న వైనం

మనతెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెంది న ఓ ఉగ్రవాదిని ముంబాయి విమానాశ్రయంలో జాతీయ దర్యాప్తు సంస్థ (యన్‌ఐఏ) పోలీసు అధికా రులకు బుధవారం పట్టుబడ్డాడు. పాక్ ప్రేరిత ఉగ్ర వాద సంస్థ అయిన లష్కర్-ఏ-తోయిబాలో ఇతగా డు సభ్యుడు. 2012లో హిందు మత పెద్దలతో పా టు పోలీసు అధికారులు, జర్నలిస్టులను హత్య చేయాలని కుట్ర పన్నాడు. రెండేళ్ల నుంచి పరారీలో ఉన్న ఈ ఉగ్రవాది దుబాయ్ నుంచి ముంబాయి విమానాశ్ర యంలో దిగడంతో నిఘా పెట్టిన అధికా రులు అతన్ని అరెస్టు చేసి బెంగుళూరులోని యన్‌ఐ ఏ కోర్టులో హజ రుపర్చారు. ఇందుకు సంబంధిం చిన పూర్తి వివరాలు యన్‌ఐఏ అధికారుల కథనం మేరకు ఇలా ఉన్నా యి. హదరాబాద్‌లోని వస్ట్‌లా న్సర్‌కు చెందిన అస దుల్లా ఖాన్ అలియాస్ అసద్ ఖాన్ అలియాస్ అబ్బు సుఫియాన్ (57) లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది. ఇతగాడు పాకిస్థాన్, దుబా య్ దేశాలకు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవా ద సభ్యులు షక్షయబ్ అహ్మద్ మీర్జా, అబ్దుల్ హకీ మ్ జమదర్, రియాజ్ అహ్మద్, మహ్మద్ అక్రమ్, ఉబేదుల్లా బహదుర్, వహీద్ హుస్సేన్, డాక్టర్ జాఫర్ ఎక్బాల్ సోలాపూర్, మహ్మద్ సిద్దిక్ అలియాస్ రాజు, మహమూబ్ భగల్‌కోటి అలియాస్ బాబా, జక్రీయ, ఓబెదుల్ రహి మాన్, నయీమ్ సిద్దిఖ్, డాక్టర్ ఇమ్రాన్ అహ్మద్, సయ్యద్ తన్జీమ్ అహ్మద్‌ల తో కలిసి బెంగళూరు, హుబ్లీ పట్టణాలలో హిందూ మత పెద్దలతో పాటు పోలీసు అధికారులు, జర్నలి స్టులను హత్య చేయాలని కుట్ర పన్నారు. ఇలా చేయడం ద్వారా బెంగుళూరు లో మత ఘర్షణలు సృష్టించాలన్నది వీరి ముఖ్య ఉద్దేశ్యం. బెంగుళూరు, హుబ్లీ ఉగ్రవాదులు తమ టార్గెట్ పూర్తి చేసేందుకు ప్రముఖ నివాసాల వద్ద రెక్కీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 28, 2012లో బెంగళూరులోని బసవేశ్వరనగర్ పోలీసుల కు ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడడంతో మొత్తం బండారం బయటపడింది. దీంతో పెద్ద కుట్ర భగ్నం అయ్యింది. క్రైమ్ నెంబర్‌పై ఐపీసీ 120బీ, 121, 121ఏ, 122, 153ఏ, 153బీ, 307, 379, 1959 ఆయుధాల చట్టం కింద వీరిపై కేసు నమోదు అ య్యింది. ఆ తరువాత ఈ కేసు యన్‌ఐఏ హైదరాబా ద్‌కు బదిలీ అయ్యింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన యన్‌ఐఏ అధికారులు అందరు నిందితులను ఏడాది క్రితమే అరెస్టు చేసి జైలుకు పంపించారు. హైదరాబా ద్‌కు చెందిన అసదుల్లా ఖాన్ మాత్రం పరారీలో ఉ న్నాడు. ఇతగాడు తన తోటి ఉగ్రవాదులు పట్టుబ డడంతో అదే రోజు దుబాయ్‌కి వెళ్లి దాకున్నాడు. బు ధవారం దుయాయ్ నుంచి విమానంలో ముంబాయి విమానాశ్రయంలో దిగడంతో సమాచారం అందు కున్న యన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూ రు యన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఇతన్ని హాజరుపరిచా రు. ఇతన్ని విచారించే నిమిత్తం నిందితుడిని పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. అసదుల్లాఖాన్‌ను విచా రిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముంబాయిలో అసదుల్లాఖాన్ పట్టుబడిన విషయం తెలియగానే నగర పోలీసులు అప్రమత్తమ య్యారు. అసదుల్లా ఇన్ని రోజులు దుబాయ్‌లో ఎక్క డ ఉన్నాడు, అతనికి ఆశ్రయం ఎవరు కల్పించారు, దేశ వ్యాప్తంగా టెర్రర్ అలర్ట్ నడుస్తున్న సమయంలో ముంబాయిలో ఎందుకు అడుగు పెట్టాడు. మరేదైన కుట్రను అమలు చేసేందుకు వచ్చాడా అనే విషయాల పై హైదరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అస దుల్లా గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఒకటి బెంగుళూరు వెళ్లినట్లు తెలసింది. మరికొందరు అధికారులు అతను నివాస ముంటున్న వస్ట్‌లాన్సర్‌కు వెళ్లారు. 2012లో బెంగు ళూరులో మత పెద్దలు, పోలీసులు, జర్నలిస్టులను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో నగరానికి చెందిన మరికొందరు ఎవరైనా ఉన్నారా అనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు.