Home జాతీయ వార్తలు తెలుగు రాష్ట్రాలకు భారీవర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు భారీవర్ష సూచన

rain-1హైదరాబాద్: ఉత్తర రాజస్థాన్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఈ అల్పపీడన ద్రోణి విస్తరించిన ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావంతో ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సమాచారం. కాగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రుతుపవనాలు ఆదివారమే పూర్తిగా విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.