Search
Wednesday 21 November 2018
  • :
  • :

500 లగ్జరీ కార్లను దొంగిలించిన హైదరాబాదీ.!

Hyderabadi stole 500 luxury cars in Delhi
న్యూఢిల్లీ:  దేశ రాజధానిలో దాదాపు 500 లగ్జరీ కార్లను అపహరించి ఢిల్లీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న హైటెక్ దొంగను ఎట్టకేలకు శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లగ్జరీ దొంగ హైదరాబాదుకు చెందిన వ్యక్తి కావడం విశేషం. అతనిపై లక్ష రూపాయల రివార్డు ఉండటం గమనార్హం. సఫ్రుద్దీన్ (29) అనే వ్యక్తి తన గ్యాంగ్ తో కలసి హైదరాబాదు నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లి పని పూర్తయిన వెంటనే తిరిగి విమానంలో హైదరాబాద్ వచ్చేవాడు. పోలీసులు నుంచి తప్పించుకోవడానికే అలా ప్లాన్ చేసుకున్నాడు. విచారణలో భాగంగా పలు విషయాలను సఫ్రుద్దీన్ పోలీసులకు చెప్పాడు. ఢిల్లీలో ప్రతి ఏడాది 100 లగ్జరీ కార్లను దొంగిలించడమే తామ టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపాడు. దొంగిలించిన కార్లను పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తామని పోలీసులకు తెలిపాడు.

Comments

comments