Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘జబర్దస్త్’కి ఆది గుడ్ బై…?!

Hyper Adi say Good by to Jabardhasth

హైదరాబాద్: ‘ఈ’టివిలో వచ్చే జబర్దస్త్ కామెడీ ప్రొగ్రామ్ ఏ రేంజ్ లో దూసుకెళ్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదేళ్లుగా ఈ ప్రొగ్రామ్ వారంలో రెండు రోజులు గురు, శుక్రవారాల్లో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. జబర్దస్త్ లో చేసిన పలువురు ఆర్టిస్ట్ లు ప్రస్తుతం సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. వీరిలో ఛమ్మక్ చంద్ర, సుధీర్, హైపర్ ఆది, ధన్ రాజ్, రాఘవ, చంటి, శేషు ఇప్పటికే పలు చిత్రాల్లో నటించారు. అలాగే ఈ ప్రొగ్రామ్ ద్వారా ఆర్టిస్టులందరూ ఆర్థికంగానూ బాగానే నిలదొక్కున్నారని సమాచారం. ఇదిలాఉండగా జబర్దస్త్ లో తనదైన పంచ్ డైలాగ్స్ తో అలరించే హైపర్ ఆదిపై ప్రస్తుతం నెట్టింట్లో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఇది ఒకింత షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

అదేంటంటే… ఆది ఇకపై జబర్దస్త్ లో కనిపించడట. జబర్దస్త్ కు అతడు గుడ్ బై చెప్పేశాడనే పుకారు షికారు చేస్తోంది. ఎందుకనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆది ఇప్పుడ సినిమాలతో బిజీగా ఉన్నాడా? లేక గ్యాప్ తీసుకున్నాడా అనే దానిపై ‘ఈ’టివి యాజమాన్యం కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక జబర్దస్త్ లో పంచ్ డైలాగ్స్ అంటే గుర్తొచ్చేది ఆదినే. అలాంటి ఆది సడెన్ గా ఇలా మాయం అవ్వడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసే అంశమనే చెప్పాలి. అయితే, ఇది కేవలం పుకారు మాత్రమేనా లేక ఆది నిజంగానే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఆది మాత్రం ఇంతవరకు స్పందించ లేదు.

Comments

comments