Home సినిమా నటనకు అది అడ్డు కాకూడదు

నటనకు అది అడ్డు కాకూడదు

rdk

అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక తనకు లేదని అంటోంది బాలీవుడ్ భామ రాధిక ఆప్టే. ఆత్మ సంతృప్తి కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని ఈ అమ్మడు చెబుతోంది. గ్లామర్, అభినయ ప్రధాన పాత్రలతో తన ప్రతిభను చాటుతున్న ఆమె దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ కథానాయికగా రాణిస్తోంది. సినిమాల్ని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టడం తనకు ఇష్టం ఉండదని చెబుతోంది రాధిక ఆప్టే. “వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని గోప్యంగా ఉంచడం నాకు నచ్చదు. భారతీయ మూలాలున్న లండన్ మ్యూజీషియన్ బెనెడిక్ట్ టేలర్‌తో కొంత కాలం క్రితం నా పెళ్లి జరిగింది. నృత్యంలో శిక్షణ తీసుకోవడానికి లండన్‌కు వెళ్లిన సమయంలో అతనితో పరిచయం ఏర్పడింది. మా అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకున్నాం. నాతో పనిచేసిన దర్శకనిర్మాతలందరికి నా పెళ్లి విషయం తెలుసు. నటనకు వైవాహిక జీవితం అడ్డుకాకూడదని నా అభిప్రాయం. అయితే సినిమాలతో వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టడం నాకు నచ్చదు. రెండింటికీ సమ ప్రాధాన్యతనిస్తాను. ఏడాదిలో కుటుంబంతో ఖచ్చితంగా ఆరు నెలలు గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. మిగిలిన సమయాన్ని సినిమాలకు కేటాయిస్తాను”అని రాధిక ఆప్టే తెలిపింది.