Home నాగర్ కర్నూల్ నేను రైతు బిడ్డనే: ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్‌రెడ్డి

నేను రైతు బిడ్డనే: ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్‌రెడ్డి

marri-janardan-reddy-image

రైతు కళ్లల్లో ఆనందం
చూడడమే ప్రభుత్వలక్షం

దేశంలో ఎక్కడా లేని
విధంగా సంక్షేమ
పథకాలు

బంగారు తెలంగాణ వైపు
అడుగులు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ రూరల్ : దేశంలో ఎక్కడా లేని విధం గా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంఎల్‌ఎ మర్రి జనార్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దేశి ఇటిక్యాల గ్రామ శివారులో గల ప్రైవేట్ సమావేశం మందిరంలో నియో జకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంఎల్‌ఎ మర్రి హాజరై మా ట్లాడుతూ రైతుల కళ్లల్లో ఆనందం చూసే రోజులు వస్తాయని అనుకోలే దని ఆయన అన్నారు. నేను కూడా రైతుబడ్డనేనని, మా చిన్నతనంలో మా నాన్న సబ్సిడీ విత్తనాలు, ఎరువుల కోసం ఉదయం 5 గంటలకు వెళ్లి రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో మా అమ్మ పడ్డ తాపత్రయం నాకు కంటితడి తెప్పించింది. దేవుడా రైతు బాధ ఇంత భయానంకంగా ఉంటుందా అనే విషయం గుర్తుకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉ న్నప్పుడు రైతు ఆత్మహత్యలు , కెసిఆర్ ప్రాణాల సైతం లెక్క చేయకుం డా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చూసి రాష్ట్రం సాధించుకున్నారన్నా రు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బిడ్డ కావున రైతుకు అండగా ఉంచి వారి సంక్షేమం కోరుకుంటున్నారని అందుకు బంగారు తెలంగాణ వైపు అ డుగులు వేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా రైతుబంధు పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరు కున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని అ డ్డ్డంకులు సృష్టించినా పట్టుదలతో రాష్ట్ర బడ్జెట్‌లో కెఎల్‌ఐ నిధులు విడు దల చేసి నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపిన ఘతన ప్రభు త్వానికే దక్కుతుందన్నారు. వేసవిలో కూడా పంట పొలాలు పచ్చగా ఉన్నాయంటే అది కెసిఆర్‌కు రైతులపై ఉన్న మమకారమని తెలిపారు. ప్రతి రైతుకు రైతు బంధు పథకం కింద రూ.4 వేల చెక్కులు అందే వరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా కార్యకర్తలు అండగా ఉండాలని ఎంఎల్‌ఎ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని మన ఇంటి పండుగల విజయవంతం చేయాలని కోరారు. ప్రతి మండలంలో గ్రా మాలకు వచ్చి రైతులు పొందే అనుభూతిని కళ్లారా చూస్తామన్నారు. కష్టాన్ని నమ్ముకుని ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నలకు నిలిచిన గొ ప్పు ముఖ్యమంత్రిఅని అన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.15 వేల కోట్లతో రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. రైతుబంధు పథకం కింద రైతులకు రూ.12 వేల కోట్లు ప్రతి ఏటా ఇస్తుందని అన్నా రు. ఈ పథకం ఎన్నికల హామీలో వాగ్ధానం చేయలేదని గుర్తు చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ 70 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వం చూపలేదని, కనీసం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఎంఎల్‌ఎ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సమైఖ్య రాష్ట్రంలో దేశంలో అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. దీనికి ప్రతిపక్షాలు వ్యతిరేక స్తూ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు చేస్తున్నారని ఆరోపించారు. రాను న్న కాలంలో రైతుల సంక్షేమం కోసం రూ.50 వేల కోట్లు బడ్జెట్‌లో ఖర్చు చేసేందుకు ప్రణాళికా సిద్ధం చేస్తుందన్నారు. కార్యక్రమంలో బక్క ని శ్రీనివాస్‌యాదవ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా రఘు నందన్‌రెడ్డి, ఎంపిటిసిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.