Home తాజా వార్తలు కాంగ్రెస్ లోకి రావడం సంతోషంగా ఉంది: కిరణ్

కాంగ్రెస్ లోకి రావడం సంతోషంగా ఉంది: కిరణ్

Kiran-Kumar-Reddy

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో తనకు విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బలపర్చాల్సిన సమయం వచ్చిందని, కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తప్ప దేశానికి సరైన దశ, దిశ లేదన్నారు. విభజన చట్టాన్ని సమర్ధంగా అమలు చేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని, విభజన చట్టాన్ని అమలు చేయడంతో బిజెపి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. ఈ విషయంలో టిడిపి, వైసిపి కూడా విఫలమయ్యాని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడినా 30 నుంచి 40 మంది నేతలు తిరిగొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.