Home స్కోర్ సచిన్ అంత దీర్ఘకాలం విరాట్ కోహ్లి

సచిన్ అంత దీర్ఘకాలం విరాట్ కోహ్లి

kohliపుణె: భారత్ క్రికెట్ కెప్టెన్ ఫామ్ ఇప్పుడు చాలా భేషుగ్గా ఉంది. పుణెలో ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లి 122 పరుగులు చేశా డు. వన్డేలో 27వ శతకం నమోదు చేశాడు. అంతే కాక ఛేదనలో సచిన్ టెండూల్కర్ 17 శతకాల రికార్డుకు సమం చేశాడు. భవిష్యత్తులో మాస్టర్ బ్లాస్టర్ మరిన్ని రికార్డులను కూడా కోహ్లి అధిగ మించనున్నాడు. తనకు ఆదర్శంగా ఉండే సచిన్ ను పోలుస్తూ మాట్లాడ్డం సరైంది కాదని, పైగా సచిన్‌తో పోల్చి ఏదన్న అడిగితే తాను మాట్లా డబోనని కూడా అతడు బిసిసిఐ డాట్ టివిలో మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్‌తో చెప్పా డు. సచిన్ ఆడినన్ని సంవత్సరాలు(24 ఏళ్లు) తానాడలేనని, ముఖ్యంగా సచిన్ 200 టెస్టులు, 100 అంతర్జాతీయ శతకాలు వంటివి సాధించ లేనని, సచిన్ తనకు ఆదర్శం అని తెలిపాడు. అయితే తాను గేమ్‌లో తన ప్రత్యేకత నిలుపుకోవా లనుకుంటున్నట్లు, మంచి రికార్డు(నోట్)తోనే వైదొలుగుతానని అన్నాడు. తన విజయ రహస్యం తన జీవితంలో తనకు సన్నిహితంగా ఎక్కువ మం ది లేకపోవడమేనన్నాడు. ఎక్కువ మంది సన్నిహి తులు ఉంటే గురి గాడి తప్పుతుందని (డిస్ట్రాక్ష న్స్), సమయ నిర్వహణ(టైమ్ మేనేజ్‌మెంట్) కూ డా పంథా తప్పుతుందని అతడు తెలిపాడు. ఎవ రైనా తన ధ్యేయాన్ని పరిమితం చేసుకోరాదని కూ డా కోహ్లి చెప్పాడు. సమతుల్యతను సాధిస్తూ ముందుకుపోవడమే ఎవరైనా చేయాల్సిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను సమతుల్యతను మెయిన్‌టెయిన్ చేస్తున్నానని అన్నాడు.