Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

డైరెక్టర్ పోస్టులపై మాకు నమ్మకంలేదు…

RTC

హైదరాబాద్: లాభ నష్టాలతో ఆర్‌టిసిని చూడొద్దని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.  సచివాలయంలో మంత్రి మహేందర్ రెడ్డితో కార్మిక సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ పోస్టులపై తనకు నమ్మకం లేదని, సమ్మెను వాయిదా వేయలేమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. యూనియన్ నేతలతో చర్చించాక శనివారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. రియింబర్స్‌మెంట్ డబ్బులు సకాలంలో ఇవ్వండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఆర్‌టిసి సమస్యల పరిష్కారానికి ఇదే చివరి సమ్మె కావాలనే కోరుకుంటున్నామన్నాయి. ఎన్నికల పేరుతో తమ సమస్యను పక్కదారి పట్టించొద్దని కార్మిక సంఘాలు కోరాయి.

Comments

comments