Home రాజన్న సిరిసిల్ల నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు

పత్తాలేని సర్కారు వైద్యులు
పర్యవేక్షణశూన్యం
రోగులను పట్టించుకోని వైద్య ఆరోగ్యసిబ్బంది
ప్రతినెల లక్షలాది రూపాయల దుర్వినియోగం

Government-Hospital

ఇల్లందకుంట (జమ్మికుంట డివిజన్): పేదప్రజలకు సర్కారు వైద్యము అందని ద్రాక్షపండుగా మిగిలింది.సర్కారువైద్యాన్ని పేదప్రజలకు అందేటట్టు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వ వైద్యశాలలు పేదరోగులకు ఎలాంటి వైద్య సేవలు అందించడంలేదు.జీతభత్యాల పేరిట ఒక ఇల్లందకుంట మండలం ఆరోగ్యసిబ్బందికి సుమారు 20లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కాని వారు రోగులకు చేసిన సేవలు శూన్యమని చెప్పవచ్చు.2004 సం॥లో ఇల్లందకుంటలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని స్థాపించారు. 2006 లో కోటిరూపాయల ఖర్చుతో సకలసదుపాయల గల భవనాన్ని నిర్మించారు.

ఇద్దరు డాక్టర్లు ఒకస్టాప్‌నర్సు,12 ఎఎన్‌ఎం లు ఒక ఎంఎల్‌టి ,ఒక ఫార్మసిస్ట్ ,ఒక జూనియర్ అసిస్టెంట్ ,కమ్యూనిటి హెల్త్‌పీసర్, పబ్లిక్‌హెల్త్‌నుర్స,హెల్త్ ఎడ్యూకేటర్ వంటి పోస్టులను మంజూరు చేశారు. అంగటిలో అన్ని ఉన్నా అల్లుని నోట్ల శనిఉన్నదన్నట్లు ఇల్లందకుంట ఆసుప్రతి రోగుల పాలిట శాపంగామారింది. సిబ్బంది ఉదయం 9గంటల నుండి 12 గంటలకు వరకు సాయంత్రం 2నుండి 4 గంటల వరకు విధులు నిర్వహించవల్సి ఉండగా నామమాత్రంగా విధులను నిర్వహిస్తున్నారు. ల్యాప్‌టెక్నిషన్ ఉన్నప్పటికి ఇక్కడ ఎలాంటి టెస్ట్‌లు జరుగడంలేదని గ్రామస్థులు తెలిపారు. డాక్టర్ పూర్ణచందర్ ,డాక్టర్ విజయపటేల్ ఇక్కడ పోస్టింగ్ పొందారు.

కాని అధికారులు అనాలోచితంగా డా॥ విజయపటేల్ ను హుజురాబాద్ కు డిప్యూటేషన్ పై పంపడంతో సర్కారు వైద్యం అందడంలేదు.ఒకేఒక డాక్టర్ పూర్ణచందర్ డ్యూటిని కొనసాగిస్తుండగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఆయన కాలుకు గాయం కావడంతో ఆయన సెలవులో ఉన్నారు. దీంతో ఆసుప్రతికి వచ్చిపోయే రోగులు ప్రభుత్వ ఆసుప్రతిలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుప్రతిలో ఒకేఒక స్టాఫ్ నర్సు ఉన్నప్పికి రోగులకు ఎలాంటి వైద్యసేవలు అందడంలేదు. ఇల్లందకుంట ,సిరిసేడు ,మల్యాల, సీతంపేట, బూజునూరు,రాచపల్లి గ్రామాలలో ఆరోగ్య ఉపపకేంద్రాలు ఉన్నప్పికి అవి ఏరోజుకూడా తెరచిఉంచడంలేదు.

మండలంలోని 16 గ్రామాల్లో 6 సబ్‌సెంటర్ లు ఉండగా ఫస్ట్ ఎఎన్‌ఎం ,సెకండ్ ఎఎన్‌ఎం ,ఆశావర్కర్లు ఎక్కడ కూడా చిత్తశుద్దితో పనిచేయడంలేదని ఆయా గ్రామాల్లో ప్రజలు లబోదిబోమంటున్నారు.మధ్యాహ్నం 2నుండి 4గంటల వరకు విధులు నిర్వహించాల్సిన సిబ్బంది ఉదయం పూట మాత్రమే విధులు నిర్వహించి మధ్యాహ్నం ఒంటిగంటకు విధులకు డుమ్మాకొడుతున్నారు.కొన్ని సార్లు మధ్యాహ్నంపూట ఆసుప్రతికి తాళంవేసి వెళ్లిపోతున్నారు. ఆసుప్రతి లో పేద,బడుగు,బలహీన వర్గాలకు ఉచితంగా వైద్యసేవలు అందించాల్సివుండగా ఆసుప్రతికి వచ్చే అవుట్‌వార్డు పెషెంట్లను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు.

ఇన్‌వార్డు పెషెంట్లను కూడా సకాలంలో సక్రమంగా చూసుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపించారు.ప్రతి మొదటి మంగళవారం వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికి జిల్లా అధికారుల ఆకస్మిక పర్యవేక్షణ లేకపోవడంతో సర్కారువైద్యం పేదలకు అందడంలేదు. పట్టాలు తప్పిన ఇల్లందకుంట ఆసుప్రతిని జిల్లాఅధికారులు ఆకస్మిక తనిఖీ చేసి డ్యూటీలకు డుమ్మాకొడుతున్న సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.