Home సినిమా ‘నాకు తారక్ అంటే పిచ్చి.. పెద్ద అభిమానిని’

‘నాకు తారక్ అంటే పిచ్చి.. పెద్ద అభిమానిని’

Kushboo and Jr NTRసీనియర్ నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. కోలీవుడ్ లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టించారు కూడా. ఇక టాలీవుడ్ లో ఆమె అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్. చాలా సందర్భాల్లో ఖుష్బూ ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా మరోసారి ఆమె తారక్ పై అభిమానాన్ని చాటారు. ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సమాధానంగా… ఇప్పుడు సినీరంగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు కదా.. మీ అభిమాన నటుడు ఎవరని ప్రశ్నించగా తెలుగులోనా, తమిళంలోనా అని అడిగింది ఖుష్బూ.

తెలుగులో అనగానే.. ”నేను జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని. నాకు తారక్ అంటే పిచ్చి. ఎన్టీఆర్ సినిమా విడుదలైందంటే చాలు తొలిరోజు థియేటర్ కి వెళ్లి విజిల్స్ వేస్తూ పేపర్లు చించి విసిరేయాలంతే.. అతడిపై నా అభిమానం ఇలా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. ‘స్టూడెంట్ నెం 1’ చిత్రం చూసినప్పటి నుండి తారక్ కి ఫ్యాన్ గా మారిపోయానని ఖుష్బూ వెల్లడించింది. జూనియర్ కి ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెలబ్రిటీలు సైతం తారక్ ని అభిమానిస్తుంటారు. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో తారక్ ఒకరని, ఆయన స్టెప్పులకు ఎగిరి గంతేయాల్సిందే. డైలాగ్స్ కు చప్పట్లు, విజిల్స్ తో థియేటర్ మార్మోగిపోవాల్సిందనని అన్నారు. ఇలా తారక్ పై తన అభిమానం గురించి చెప్పారు ఖుష్బూ.

I am Very Big Fan of Jr NTR says Senior Actress Kushboo

Telangana Breaking News