Home సినిమా కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేస్తున్నా

కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేస్తున్నా

శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్యదేవ్, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 28న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నందితాశ్వేత మాట్లాడుతూ “నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు పా.రంజిత్ నాకు ‘అట్టకత్తి’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నా నటనకు మంచి స్పందన వచ్చింది. ఆతర్వాత చదువుపై దృష్టిపెట్టి ఎంబిఎ పూర్తిచేశాను. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో మంచి పాత్రలో నటించాను. ఆ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించాను. ఇక దర్శకుడు గోపీ గణేష్ నా సినిమాలు చూసి నాకు ‘బ్లఫ్ మాస్టర్’లో అవకాశం ఇచ్చారు. తెలుగులో ఇది నా మూడో సినిమా. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నా పాత్ర పేరు అవని. నా పాత్రలో చాలా వేరియేషన్స్ కనపడతాయి. హీరో సత్యదేవ్ అద్భుతంగా నటించారు. దర్శకుడు గోపీ గణేష్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక కంటెంట్‌ను నమ్మి నేను సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 22 సినిమాలు చేశాను. ఈ ఏడాది 11 తెలుగు సినిమాలకు సైన్ చేశాను. ప్రతి సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కల్కి, అభినేత్రి, ప్రేమకథా చిత్రమ్2, అక్షర, 7, దేవి2 తదితర చిత్రాలతో వచ్చే ఏడాది నేను ప్రేక్షకుల ముందుకు వస్తాను”అని అన్నారు.

I believe in the content of the film : Nandhita Swetha

Telangana News