Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఏ పాత్రనైనా అవలీలగా చేసేయగలను

Kajal-Agarwal-Hot-Pics-1

అందాలతార కాజల్ అగర్వాల్ తనకన్నీ తెలుసు అంటోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు స్టార్ హీరోలందరితో జోడీ కట్టేసిన ఈ భామ తాజాగా ‘ఖైదీ నంబర్ 150’లో మెగాస్టార్ చిరంజీవితో నటించి ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ “నటీనటుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంటే… మరొకరికి ప్రేమ సన్నివేశాల్లో చక్కగా నటించే నేర్పరితనం ఉంటుంది. ఇంకొందరికి శోక సన్నివేశాల్లో జీవించే ప్రతిభ ఉంటుంది.

అయితే నాకు మాత్రం అన్నీ తెలుసు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేయగలను. నిజం చెప్పాలంటే తొలి రోజుల్లో నాకు ఏమీ తెలియదు. ముఖ్యంగా ఏడవడం అస్సలు తెలియదు. చిన్నతనం నుంచి నేను ఏడ్చిన సందర్భాలు లేవు. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడేదాన్ని. కన్నీరు వచ్చేది కానీ అందులో జీవం ఉండేదికాదు. ఇప్పుడు ఏడవడంతో పాటు అన్నీ నేర్చుకున్నాను. కెమెరా ముందుకు రాగానే దర్శకుడు యాక్షన్ అనగానే ముఖంలో శోకాన్ని నింపుకొని ఏడుపు సన్నివేశంలో జీవించేస్తాను. కథ, పాత్రలను అవగాహన చేసుకొని అందులో లీనమై నటించే పరిణితిని సాధించాను.

అందుకే నటిగా నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను”అని చెప్పింది. ఇక పెళ్లిపై ఈ భామ మాట్లాడుతూ “పెళ్లి అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. దానిని నేను గౌరవిస్తాను. నచ్చిన మనిషి తారసపడితే మన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటా. కానీ పెళ్లి ఎప్పుడనేది నా చేతుల్లో లేదు”అని ఈ బ్యూటీ చెబుతోంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ… “నేనేదీ ప్లాన్ చేసుకోను. పెళ్లి తర్వాత కథానాయికగా కొనసాగడం అన్నది నన్ను కట్టుకోబోయేవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. ఒకరితో రిలేషన్‌లో ఉండేంత ఖాళీ నాకు లేదు. క్షణం తీరిక దొరికితే ఇంకేం చెయ్యాలి, కథానాయికగా ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపైనే నా ధ్యాస ఉంటుంది”అని తెలిపింది కాజల్.

Comments

comments