Home సినిమా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచను

ఆ విషయాన్ని రహస్యంగా ఉంచను

anu

ప్రేమ విషయంలో తాను ఎంతో పరిణితిగా ఆలోచిస్తానని చెప్పింది స్టార్ బ్యూటీ అనుష్క. తన దృష్టిలో యవ్వన ప్రాయంలో కలిగే ఓ మ్యాజిక్‌లాంటిదే ప్రేమ అని తేల్చి చెప్పింది. వయసు పెరిగే కొద్ది భావోద్వేగాల తీవ్రత తగ్గిపోతుందని, టీనేజ్ రోజుల్లోని సంఘటనల్ని తలచుకుంటే సిల్లీగా అనిపిస్తాయని పేర్కొంది. తాజాగా అనుష్క ప్రేమ గురించి మాట్లాడుతూ “యవ్వనం ఆరంభంలో ప్రేమ గురించి ప్రతి ఒక్కరు తీయటి కలలుకంటూ ఉంటారు. జీవితంపై ఏమాత్రం అవగాహనలేని వయసు కాబట్టి ఒక్క ప్రేమ గురించి తప్ప వేరే విషయం గురించి ఆలోచించరు. చాలామంది తాము ప్రేమలో ఉన్నామనే కృత్రిమమైన భావన కలిగిఉంటారు. అందుకే టీనేజ్ ప్రేమ కథలు కొద్దిరోజుల్లోనే విఫలమవుతాయి. వయసు పెరిగే కొద్ది ప్రేమపై మన అభిప్రాయాలన్నీ తప్పని అర్థమవుతుంది”అని తెలిపింది అనుష్క. మరి మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా అని అడగ్గా… “ఇప్పటివరకు నేను ప్రేమలో పడలేదు. ప్రస్తుతం నేను నా సినిమాల్ని మాత్రమే ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయాన్ని బహిరంగంగానే చెబుతాను. రహస్యంగా ఉంచను”అని చెప్పింది ఈ బ్యూటీ.