Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బాంచన్ నేను బతికే ఉన్నా..!

"I do not have a thousand rupees pension for my month and the last six months

పింఛన్ కోసం ఓ గిరిజనుడి ఆవేదన

మన తెలంగాణ/టేకులపల్లి : ‘సారూ నాకు నెల నెలా వచ్చే వెయ్యి రూపాల పింఛను, గత ఆరు నెలల సంది రావడం లేదు… జర చూడండి సారు దండం పెడతా’ ‘అరే నీకు పింఛను ఎట్లా వస్తదయ్యా.. నీవు చచ్చిపోయావు కదా అందుకే నీకు పింఛను రావట్లేదు’ ‘ఆం… ఏంటి సారూ నీవు చెప్పేది, నీను చచ్చిపోయానా..?!? బాణోతు పంతులు అనే వృద్ధుడి పింఛను కథ. ఇది ప్రభుత్వ అధికారుల పని తీరుకు అద్దం పట్టే చిన్న ఉదాహరణ మాత్రమే. మండల పరిధిలోని ముత్యాలంపాడు అడ్డరోడ్డు గ్రామానికి చెందిన బాణోతు పంతులుకు గత రెండేళ్లకు పైగా వృద్ధాప్య పింఛన్ వస్తోంది. నెలకు రూ. వెయ్యి వంతున పంతులు బ్యాంకు ఖాతాలో ప్రతి నెల జమ అవుతున్నాయి. ఎలాంటి ఆటంకం లేకుండా ఈ రెండేళ్లు ఏ నెలకానెల బ్యాంకు నుంచి పింఛను వెయ్యి చొప్పున తీసుకుం టూ వస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా గత ఆరు నెలలు గా పింఛను రావడం నిలిచిపోయింది. ఎందుకో అర్థం కాలేదు. ఈ విషయమై స్థానిక ఐకెపి కార్యాలయానికి చేరుకుని, తన గోడును వినిపించాడు అక్కడి అధికారికి. సదరు ఆ అధికారి కంప్యూటర్‌లో చూసి, అరే తాత నీవు ఆరు నెలల కిందటే చచ్చిపోయావు కదా,.. నీకు పింఛను నిలిపివేశారు… నీకు పింఛను రాదు.. అని చావు కబురు చల్లగా చెప్పాడు. దాంతో హతాశుడయ్యాడు పంతులు. తాను బతికే ఉన్నానని, నా పింఛను ఎలా తీసేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం జరిగిన ఎంపిపి సర్వ సభ్య సమావేశంలో తన గోడును జెడ్పీటిసి లక్కినేని సురేందర్, ఎంపిపి భూక్యా లక్ష్మీ, అధికారులు, ఇతర ప్రజాప్రతినిథులకు వినిపించాడు. దాంతో వారు అధికారుల పని తీరుపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. త్వరలోనే పింఛను పునరుద్ధరించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు.

Comments

comments