Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నేనేమీ ఫీల్ కాను

Nithya-Menon

ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్ నిత్యామీనన్. ఆమె మనసులో దాపరికాలుండవు. లోపల ఉన్నదే బయటకు అనేస్తుంది. తన వ్యక్తిగత విషయాల జోలికొస్తే అస్సలు ఊరుకోదు. ఇలాంటి ప్రవర్తన వల్ల ఆమె టాలీవుడ్‌లో కొన్ని అవకాశాలను కూడా కోల్పోయింది. ఇటీవల ‘గీత గోవిందం’లో నిత్యామీనన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. తెరపై ఆమెను చూసినప్పుడు ఇంత లావైపోయిందేమిటని అంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని కొందరు ఆమెను అడిగారట. “బొద్దుగా ఉన్నానని నేనేమీ ఫీల్ కాను. ఆత్మవిశ్వాసం గల అమ్మాయిని నేను. నేనేమిటో, నా జీవితమేంటో నాకు తెలుసు. నన్ను విమర్శించిన వాళ్లను చూస్తే నవ్వొస్తోంది. ఏ పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారు. పనున్న వారెవరూ ఎదుటి వారి జీవితాల్లోకి తొంగి చూడరు”అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చింది నిత్యామీనన్.

Comments

comments