Home సినిమా అలాంటి క్యారెక్టర్లు చేయను

అలాంటి క్యారెక్టర్లు చేయను

 

గొప్ప నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించింది కీర్తిసురేష్. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంతో హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇక కీర్తిసురేష్ తెలుగులో నేను శైలజ, నేను లోకల్ చిత్రాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో ఆమె ఎంతో పద్ధతిగా కనిపించింది. వీటిలో అందాల ప్రదర్శన చేయకుండా చక్కగా నటించింది.

అయితే కీర్తిసురేష్ సినిమాల్లో గ్లామర్ క్యారెక్టర్లు చేయనంటోంది. తాను ఉద్దేశపూర్వకంగానే అలాంటి క్యారెక్టర్లు చేయడం లేదని చెబుతోంది. “నాకుగ్లామర్ పాత్రలు సరిపోవు. నేను అలాంటి పాత్రలు చేయను. ఐదేళ్ల తర్వాత కూడా ఇదే మాట చెబుతాను. అందాల ప్రదర్శన చేయను అంతే”అని స్పష్టం చేసింది కీర్తి సురేష్. ఇక ‘మహానటి’ వంటి ప్రత్యేకమైన సినిమాలో సావిత్రి పాత్రలో నటించడంపై ఆమె మాట్లాడుతూ “ముందుగా సావిత్రి పాత్ర అనగానే నాకు భయమేసింది. నేను చేయగలనా అనిపించింది. అయితే నేను ఆ పాత్రకు సరిపోతానని ఫిల్మ్‌మేకర్స్ చెప్పడంతో ధైర్యం వచ్చేసింది. ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది”అని చెప్పింది.

I don’t play Glamorous roles says Keerthi Suresh