Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

హర్రర్ సినిమాలంటే భయం

alia

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ అలియాభట్. విభిన్న పాత్రలతో అలరిస్తున్న ఈ భామకు చీకటి, హర్రర్ అంటే చాలా భయమట. అందుకే హర్రర్ సినిమాల్లో నటించాలనుకోవడం లేదని చెబుతోంది. బాలీవుడ్‌లో హర్రర్ సినిమాలకు పేరొందిన మహేష్‌భట్ కుమార్తె అలియాభట్ ఇలా హార్రర్ సినిమాలంటే భయమని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హార్రర్ సినిమాలంటే భయమని చెప్పిన అలియా తనకు గాడ్జిల్లా వంటి పెద్ద జంతువులన్నా భయమేనని చెబుతోంది. అంత భయమెందుకు అంటే… “ఒకసారి నా పుట్టినరోజు పార్టీకి గాడ్జిల్లా రావాలని అనుకున్నా. నా కోసం మా వాళ్లు గాడ్జిల్లా బొమ్మను ఏర్పాటుచేశారు. కానీ అంత పెద్ద ఆకారాన్ని చూడగానే భయపడిపోయా. ఆ రోజు ఏడ్చుకుంటూ మా అమ్మ ఒడిలోనుంచి దిగనేలేదు. అప్పటి నుంచి నాకు గాడ్జిల్లా అన్నా… పెద్ద జంతువులన్నా… హర్రర్ సినిమాలన్నా చాలా భయం” అని తన చిన్ననాటి సంఘటన గురించి చెప్పుకొచ్చింది అలియాభట్.  “ నా సినిమాలు పిల్లలు కూడా చూస్తారు…అందులో వాళ్లు నన్ను చూసి ఇష్టపడాలే కానీ భయపడకూడదు. అందుకే హర్రర్ సినిమాల్లో నటించాలనుకోవడం లేదు”అని చెప్పింది ఈ భామ.

Comments

comments