Home సినిమా అప్పట్లో నరకయాతన అనుభవించా

అప్పట్లో నరకయాతన అనుభవించా

తెరపై అద్భుతంగా ప్రేమను పండించే కొన్ని జంటలు నిజ జీవితంలో కూడా ప్రేమలో పడి… విడిపోతుంటారు. సినీ లోకంలో ఇది సాధారణ విషయంగా మారింది. ఇలా కలవడం, విడిపోవడం సాధారణమే అయినా… అందరి విషయాల్లో ఒకేలా ఉండదు. ప్రేమ విషాదం కొందరి సినీ జీవితాలనే కాకుండా వ్యక్తిగత జీవితాలపై సైతం తీవ్ర ప్రభావం చూపింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినాకైఫ్ సైతం ప్రేమలో విఫలమై చెప్పడానికి వీలుకాని బాధను అనుభవించిందట. ముందుగా కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో ప్రేమలో పడ్డ ఈ భామ… ఆ బంధం తెగిపోయాక ఆ బాధ నుంచి విముక్తి కావడానికి చాలా కష్టపడింది. అనంతరం మరో హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమను పంచుకున్న కత్రినాకు అతని నుంచి కూడా విడిపోక తప్పలేదు. ఈసారి మాత్రం తను ఎంతో నరకయాతనను అనుభవించానని చెప్పింది ఈ భామ. అయితే ఆ వేదన నుంచి బయటపడడానికి వ్యాయామాన్ని ఆసరాగా తీసుకున్నానని… ఒక్కోసారి అతిగా వ్యాయామం చేసేదాన్నని, అప్పుడే ఆ బాధను మరచిపోయేదాన్నని పేర్కొంది. రణబీర్‌తో తన బ్రేకప్, అనంతరం పరిణామాలు వంటి విషయాలపై కత్రినా ఇటీవల మాట్లాడింది. “ప్రేమలో బ్రేకప్ తర్వాత ఎక్కువగా జిమ్‌కు వెళ్లేదాన్ని. వ్యాయామంపై ఎక్కువగా దృష్టి పెట్టేదాన్ని. అతిగా కసరత్తులు చేసేదాన్ని. నా కలల గురించి… భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించేదాన్ని. వ్యాయామం వల్ల క్రమశిక్షణతో పాటు, మానసిక బలం కూడా పెరిగింది. క్రమంగా నేను ఆ బాధ నుంచి తేరుకొని కెరీర్‌పై తిరిగి దృష్టిపెట్టగలిగాను”అని కత్రినా పేర్కొంది

I Felt Like Hell in Those Days : Katrina Kaif

Telangana News