Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్ స్టెప్స్ చూస్తూ పెరిగాను

Jani-Masterతెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఎంతో పాపులారిటీ ఉంది. మెగా హీరోల సినిమాలకు ఈమధ్య వరుసగా డ్యాన్స్ కంపోజ్ చేస్తూ కొరియోగ్రాఫర్‌గా అతను టాప్ రేంజ్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు టాప్ డ్యాన్స్ కంపోజర్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’కి కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఇక తాజాగా చిత్ర యూనిట్ సాంగ్ చిత్రీకరణకు స్లోవేనియా దేశానికి వెళ్లడం జరిగింది. అక్కడ జానీ మాస్టర్ నేతృత్వంలో చిరంజీవితో పాటు స్టార్ బ్యూటీ కాజల్ కూడా స్టెప్స్ వేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ “ప్రతి పాటకు కొరియోగ్రఫీ చేసేందుకు వెళ్లేటప్పుడు ముందుగా చిరంజీవి సాంగ్స్ చూసే వెళ్తాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో వర్క్ చేస్తుండంతో గొప్ప అనుభూతినిస్తోంది. మెగాస్టార్ స్టెప్స్ చూస్తూనే నేను పెరిగాను. ఎన్నో స్టేజీలపై ఆయన స్టెప్స్ వేశాను. అలాంటిది ఆయన ఇప్పుడు నేను కంపోజ్ చేస్తున్న స్టెప్స్ వేయనుండడం చాలా హ్యాపీగా ఉంది”అని అన్నాడు.

Comments

comments