Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం ఉండదు

Bramhaji

గీతా ఆర్ట్, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి స్థాపించిన వి4 క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నెక్ట్ నువ్వే’. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రభాకర్ దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ “ఈమధ్య నేను చేసిన బెస్ట్ మూవీ ‘నెక్ట్ నువ్వే’. నా కెరీర్‌లో ఈ తరహా సినిమా నేను ఇంతవరకు చేయలేదు. ఈమధ్య హార్రర్, కామెడీ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. తొలిసారి నేను చేసిన హార్రర్, కామెడీ మూవీ ఇది. ఇందులో నాది అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సందర్భానుసారంగా మారిపోయే పాత్ర నాది. సినిమాలో ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. హీరో ఆదికి సపోర్టింగ్ రోల్ నాది. ఆది మంచి యాక్టర్. మా కాంబినేషన్‌లోని సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా కథ విషయానికొస్తే… ఓ హోటల్‌కు వచ్చేవారు చనిపోతుంటారు. నెక్ట్ ఎవరు చనిపోతారో తెలియదు. ఎందుకు అలా జరుగుతోందనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.  దర్శకుడు ప్రభాకర్ మంచి అనుభవం ఉన్నవాడిలా సినిమాను తెరకెక్కించాడు.  అతను తొలి సినిమా డైరెక్టర్‌గా కనిపించలేదు. పలు టివి షోలు, సీరియల్స్‌కు పనిచేసిన అనుభవం అతనికి ఉంది. ప్రభాకర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నలుగురు ప్రధాన క్యారెక్టర్లతో కూడిన చిత్రమిది.  కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ఫన్, హార్రర్, కామెడీ ఇందులో సమానంగా ఉంటాయి.ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. కెరీర్‌లో 40 సినిమాల్లో మంచి రోల్స్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాకు మంచి పేరొచ్చింది. ఇక సినిమా సక్సెస్, ఫెయిల్యూర్‌తో క్యారెక్టర్ ఆర్టిస్టుకు సంబంధం ఉండదు. ఇండస్ట్రీలోని విలన్, ఎమోషనల్ క్యారెక్టర్‌లో నేనొకడిని. కానీ నేను కమేడియన్ ఆర్టిస్టుని కాను. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘రంగస్థలం’లో ఓ మంచి రోల్ చేస్తున్నాను. నానీ సినిమాలో కూడా నటిస్తున్నాను”అని అన్నారు.

I have not done this kind of film yet:Bramhaji

Comments

comments