Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

డెత్ బౌలింగ్‌లో ఒత్తిడిని అధిగమించా!

  • సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ వ్యాఖ్య

Death-Bowling-Bhuvi

హైదరాబాద్: ఐపిఎల్ 10 సీజన్‌లో ఉప్పల్ వేదికగా పంజాబ్ తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకు న్నాడు. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు మనన్ వోహ్రా 50 బంతుల్లో 95 పరుగులతో దూకుడుగా ఆడుతున్న క్రమంలో డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ అందుకున్న  భువీ అద్భుతం చేశాడు. ఈ మ్యాచ్‌లో 5/19తో సన్‌రైజర్స్ విజయంలో భువనేశ్వర్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం భువనేశ్వర్ మీడియాతో మాట్లాడా డు. ‘ఒత్తిడిని అధిగమించి డెత్ బౌలింగ్ చేయడం నాకు తప్పని సరైంది. నా గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. మన ఊహించని పరిణామాలు ఎన్నో ఎదురయ్యేది టి20 క్రికెట్‌లోనే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొన్నేళ్లుగా పనిచేస్తున్నా. ఈ మ్యాచ్‌లో 19 ఓవర్ నేను వేయాల్సి వస్తుందిని నాకు తెలుసు. 16, 17 ఓవర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు గ్రహించాను. ఆ సమయంలో బ్యాట్స్‌మన్ దూకుడు మీద ఉంటాడని తెలుసు. అయినా నేను ఒత్తిడికి లోనుకాలేదు. కానీ, దాన్ని అధిగమించేందుకు ఏదైనా వ్యూహాన్ని రచించాలనుకున్నా. కెప్టెన్ వార్నర్, నేను నేరుగా యార్కర్లతో బౌలింగ్ చేయాలని ప్రణాళాలు రచించాం. అది ఊహించినట్టుగానే విజయవంతం అయింది. నేను బలంగా నమ్మిన డెత్ బౌలింగ్‌నే ఇక్కడ ప్రయోగించాను’ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లా. నా ప్రయత్నం ఫలించి అనుకూలంగా వచ్చింది’. అని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన భువనేశ్వర్ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా భువనేశ్వర్ డెత్ బౌలింగ్ శైలిపై ప్రసంశల జల్లు కురిపించాడు. ‘అద్భుత ప్రదర్శన చేసిన పంజాబ్ ఆటగాడు మనన్‌కు ఈ ఘనత దక్కుకుంది. అలాగే డెత్ బౌలింగ్‌తో పంజాబ్‌ను కుప్పకూల్చిన భువనేశ్వర్ కుమార్ కూడా ఈ ఘనత దక్కుతుంది. నమ్మలేని రీతిలో భువీ అధ్బుతం చేశాడు. మనన్ కూడా తన జట్టు కోసం తీవ్రంగా శ్రమించాడు. ఆట అన్నాక ఏదో ఒక జట్టు గెలవాల్సి ఉంటుంది. చివరి సమయంలో డెత్ బౌలింగ్‌తో అద్భుతం చేసిన భువీకే ఈ ఘనత దక్కుతుంది’ అని వార్నర్ అభిప్రాయపడ్డాడు.

Comments

comments