Search
Wednesday 26 September 2018
  • :
  • :

నెటిజన్లపై కెటిఆర్ ఆగ్రహం

ktr

హైదరాబాద్: రాష్ట్ర ఐటిశాఖ మంత్రిగా కెటిఆర్ తన కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ సినిమాలకు సంబంధించి తన అభిప్రాయాలను ట్విటర్ ద్వారా పంచుకుంటుంటారు. అయితే శనివారం రాత్రి వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమా చూశానని మంత్రి కెటిఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇది కొందరు నెటిజన్లకు నచ్చలేదు. ఆ తర్వాత కెటిఆర్ ట్విటర్‌లో తన ప్రొఫైల్ ఫోటోను మార్చుకున్నారు. నెటిజన్లు దీన్ని కూడా తప్పుబట్టడంతో కెటిఆర్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను సినిమాలు చూస్తున్నానని, ప్రొఫైల్ పిక్చర్‌లు మారుస్తున్నానని ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వారందరికీ ఒక్కటే చెప్పదలుకున్నాను. నేను మంత్రినే అయినా నాకూ కొన్ని ఇష్టాయిష్టాలుంటాయని, అవి మీకు నచ్చకపోతే నిరభ్యంతరంగా నన్ను ట్విటర్‌లో అన్‌ఫాలో అవ్వచ్చు’నని కెటిఆర్ ట్వీట్ చేశారు.

Comments

comments