Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నాకు కాస్త షార్ట్ టెంపర్ ..

Shruti-hasan5

తండ్రి పేరుతో శృతిహాసన్ సినిమాల్లోకి అడుగుపెట్టినా… ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దీనివెనుక ఎంతో కృషి, ఏదో సాధించాలనే తపన ఉంది. ఈ నేపథ్యంలో శృతిహాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. “నాన్నగారి పేరుతోనే నేను సినిమా ఇండస్ట్రీలో నిలబడగలిగాను. అయితే అవకాశాల కోసం ఆయన ఏ ప్రొడ్యూసర్‌కు ఫోన్ చేయలేదు.

మా అమ్మాయిని మీ సినిమాలో పెట్టుకోండి అని అడగలేదు. చిత్ర పరిశ్రమలో గాడ్‌ఫాదర్ ఉండాలని చాలామంది అంటుంటారు. నాకు గాడ్‌ఫాదర్ ఎవరంటే సమాధానం చెప్పలేను. కానీ నాన్నగారి ప్రభావం అయితే ఉంది. నాకు కాస్త షార్ట్ టెంపర్ ఎక్కువ. సమయం, సందర్భాన్ని బట్టి అది మారుతుంటుంది. ఆ టెంపర్‌తో ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఎవర్నీ కొట్టలేదు. కానీ స్కూల్ టైమ్‌లో అయితే చాలామందినే కొట్టా.

జీవితంలో ఏదీ స్థిరంగా ఉండదు. మనలో ప్రతిభ, పనిపట్ల అంకితభావం, కష్టపడేతత్వం ఉండే ఎక్కడైనా రాణిస్తాం. మనకు నచ్చినట్లు ఉండాలి, ఇష్టమైంది తినాలి. ఎవరి కోసమో మన ఇష్టాయిష్టాలను మార్చుకోకూడదు. ఇది నా పాలసీ. మా ఇంట్లో నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇక బ్రాండ్స్ పేరుతో డబ్బు వృధా చేయడం నాకు నచ్చదు.

నన్ను అడిగితే ఖరీదైన ఫ్యాషన్ డిజైన్ కూడా అనవసం, నాకు షాపింగ్ చేయడమంటే పిచ్చి. నచ్చినవి ఇష్టమొచ్చినట్లు కొనేస్తా. అలాగని బ్రాండ్స్ జోలికి వెళ్లను. సింపుల్ ఐటమ్స్ కొనుక్కుంటా. రోడ్డుమీదైనా సరే నచ్చిన వస్తువును మొహమాటం లేకుండా కొనేస్తా. ఆ వస్తువు ఎక్కువ కొన్నా నేను పెట్టుకుంటే ఫ్యాషనే కదా. రాక్‌స్టార్, కిల్‌బిల్ క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. ఇవే నా డ్రీమ్ రోల్స్‌”అని శృతిహాసన్ చెప్పింది.

Comments

comments