Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘2 నెలలు అజ్ఞాతంలో గడిపాను’: వెంకయ్యనాయుడు

venkaiah

న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ హయాంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించి అందరు తెలుసుకోవాలని, అది మన చరిత్రలో భాగమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రసార భారతి ఛైర్మన్ ఎ. సూర్యప్రకాశ్ రచించిన ‘ఎమర్జెన్సీ: ఇండియన్ డెమోక్రసిస్ డార్కెస్ట్ అవర్’(తెలుగు, హిందీ, కన్నడ, గుజరాతీ) భాషల్లో అనువదించిన ఈ పుస్తకాన్ని సోమవారం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఎమర్జెన్సీ కాలంలో స్వీయ అనుభవాలను వివరించారు. ఆంతరంగిక కలహాల పేరుతో దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని, దానికి వ్యతిరేకంగా 1977 ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా తీర్పునిచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్యం అదుపు తప్పితే ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్, వాజ్‌పేయి, అద్వానీతో సహా పలువురిని జైలులో పెట్టారని చెప్పారు. ఆ సమయంలో తాను విద్యార్థిగా ఉన్నానని, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు తాను 2 నెలలు అజ్ఞాతంలో గడిపానని గర్తుచేసుకున్నారు. ఆ తర్వాత తనను కూడా అరెస్టు చేసి 17 నెలలు జైలులో ఉంచారని, ఆ సమయంలోనే తనకు ప్రముఖ విపక్ష నేతలు, రచయితలు, పాత్రికేయులతో సాన్నిహిత్యం పెరిగిందని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.

Comments

comments