Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

క్రిష్ నుంచి నేను చాలా నేర్చుకున్నా!

ss-rajamouliపెద్ద సినిమా విడుదలైన రోజునే మిస్ అవ్వకుండా చూసి దానిమీద తన మార్కు రివ్యూ ఇచ్చేస్తాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని గురువారం తెల్లవా రుజామునే చూసి ఆయన రివ్యూ ఇచ్చేశాడు. “సాహో బసవతారక పుత్ర బాలకృష్ణ. శాతకర్ణి పాత్ర పోషించినందుకు సెల్యూట్. ఎన్.టి.రామారావుగారు గర్విస్తారు. ఇటువంటి అనితరసాధ్యమైన అనుభూతిని కేవలం 79 రోజుల్లో చిత్రీకరించిన క్రిష్ నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నా. 12 కోట్ల తెలుగు ప్రజల దీవెనలు నీకెప్పుడు ఉంటాయి. సాయిమాధవ్ కలం శాతకర్ణి ఖడ్గంతో సమానం. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు అద్భుతం. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది”అని ట్వీట్ల వర్షం కురిపించాడు. ఒక పీరియాడిక్ మూవీకి రాజమౌళి నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఆ సినిమా సూపర్‌హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Comments

comments