Search
Sunday 23 September 2018
  • :
  • :

అనుష్క అంటే ఇష్టం

Raashi-Khannaటాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్‌గా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న భామ రాశీఖన్నా. ఆమె ఈమధ్య స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. అయితే ఈమధ్య కాలంలో తాను చాలా సినిమాల్ని వద్దనుకున్నానని చెప్పింది రాశి. పాత్రలు నచ్చకే తాను అలా చేశానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. “నా పాత్రలకు ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటా. ఊరికే పాటల్లో కనిపించి వెళ్లిపోవడం నాకిష్టముండదు. అయితే నిజం చెప్పాలంటే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఈ తరహాలోనే ఉంటాయి. ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ ఉన్నంతలో కాస్త మెరుగ్గా ఉన్న పాత్రల్ని ఎంచుకోవాలని ప్రయత్నిస్తా. ఏ ప్రత్యేకతాలేని పాత్రల్ని తిరస్కరిస్తా. ఇలా చాలా సినిమాలు వద్దనుకున్నా”అని చెప్పింది రాశీఖన్నా. ఇక తనకు టాలీవుడ్ హీరోయిన్లలో అనుష్క అంటే ఇష్టమని… ఆమె తనకు ఒకరకంగా రోల్ మోడల్ అని ఈ భామ చెప్పింది. “అనుష్క అద్భుతమైన పాత్రలు చేసింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆమెలాగా ప్రత్యేకమైన పాత్రలు చేయాలని నాకు ఆశ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల ఆఫర్ చేస్తే తప్పకుండా చేస్తా”అని రాశీఖన్నా పేర్కొంది.

Comments

comments