Search
Sunday 23 September 2018
  • :
  • :

రికార్డు సొంతం

pooja
టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే ఈ తరం హీరోల్లో గుర్తొచ్చే పేర్లు మూడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్… ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తారు. ఈ ముగ్గురితోనూ చిందులు వేసే అవకాశం ఒక హీరోయిన్‌కు తక్కువ సమయంలో వచ్చిందంటే ఖచ్చితంగా ఆమె అదృష్టవంతురాలేనని చెప్పుకోవాలి. ఈ భామ ఎవరో కాదు ‘డీజే’ మూవీతో అదరగొట్టిన పూజా హెగ్డే. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు ప్రేక్షకులను మైమరపించాయి. ఆతర్వాత ‘రంగస్థలం’ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి జిగేలు రాణి… పాటలో ఇరగదీసేసింది. ఇద్దరు మెగా హీరోల సినిమాల్లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ‘అరవింద సమేత…’లో నటిస్తోంది పూజ. ఈ చిత్రంలో తారక్‌తో కలిసి ఆటాపాటలతో ప్రేక్షకులను అలరించనుంది. ఇలా టాలీవుడ్‌లో టాప్ 3 డ్యాన్సింగ్ హీరోలతో సినిమాలు చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకుంటోంది హాట్ బ్యూటీ పూజా హెగ్డే. ఇక తనకు డ్యాన్స్ అంటే ప్యాషన్, పిచ్చి అని అంటోంది ఈ భామ. మ్యూజిక్ వింటే అసలు తనకు కాళ్లు నిలవడవని… డ్యాన్స్ చేస్తూనే ఉంటానని చెప్పిన పూజాహెగ్డేకు అందుకు తగినట్లుగానే అవకాశాలు వస్తున్నాయి.

Comments

comments