Home రాష్ట్ర వార్తలు నేనూ నా పిల్లలు దళితులమే

నేనూ నా పిల్లలు దళితులమే

mom-rohitమాల కులస్థులమే, ఢిల్లీ నిర్భయ కులం అడిగారా : రోహిత్ తల్లి రాధిక
హైదరాబాద్ : తాను తన ముగ్గురు పిల్లలు దళితులే నని, మాల కులానికి చెందిన వారమ ని రోహిత్ తల్లి రాధిక స్పష్టం చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాల యంలో ఆత్మహత్య చేసుకున్న పరిశో ధక విద్యార్థి రోహిత్ కులంపై వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు. ఈ మేరకు శనివారం తమ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన వివరాల తో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన తల్లిదండ్రులిద్దరు దళితులేనని, మా ల కులానికి చెందిన వారని ఆమె తెలిపారు. తన ఐదవ ఏట తన తల్లిదండ్రులు వడ్డెర కుటుంబాని కి వారికి అనధికారికంగా దత్తత ఇచ్చా ర ని చెప్పారు. అప్పటి నుంచి వారి వద్దే తాను పె రిగానని, తనను పెంచిన వడ్డెర కుటుంబం తనకు వడ్డెర కులానికి చెందిన వ్యక్తితో 1985లో వివా హం జరిపారని రాధిక తెలిపారు. తమకు ముగ్గు రు సంతానమని, 1990లో చివరి సంతానం కలి గిందని ఆమె పేర్కొన్నారు. తమకు చివరి సంతా నం కలిగిన తర్వాత వ్యక్తిగత కారణాలతో భర్త నుండి విడిపోయానన్నారు. విడిపోయిన తర్వాత తాను జన్మించిన మాల కులానికి చెందిన వారుం డే ప్రాంతానికి వెళ్లి నివసించానని తెలిపారు. తన ముగ్గురు పిల్లలు దళితుల సంప్రదాయాలు, ఆ చారాల మధ్య పెరిగారని ఆమె పేర్కొన్నారు. తన తో పాటు తన ముగ్గురు పిల్లలు దళితుల సంప్ర దాయాలు, ఆచారాలనే పాటిస్తున్నామని రాధిక వివరించారు. తన భర్త మాత్రమే వడ్డెర కులానికి చెందినవాడని ఆమె అంగీకరించారు. ఢిల్లీ అత్యా చారం కేసులో నిర్భయ కులం ఏంటని అడగని వారు రోహిత్ కేసు విషయంలో కులమెందుకు అడుగుతున్నారని రాధిక ప్రశ్నించారు.