Home రాజన్న సిరిసిల్ల తెలంగాణ వచ్చే…‘రైతుబంధు’ చిరునవ్వుతెచ్చే రూ.30కోట్లతో సినారె ఎగ్జిబిషన్

తెలంగాణ వచ్చే…‘రైతుబంధు’ చిరునవ్వుతెచ్చే రూ.30కోట్లతో సినారె ఎగ్జిబిషన్

ktr-image

నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి
కేంద్రంపై ఒత్తిడితో మద్దతు ధర
జూన్ 2న ఉచిత బీమా
ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు

మన తెలంగాణ/వేములవాడ: తెలంగాణ వస్తే ఏమస్తది…అదే పాలకులు అదే తీరు అని ప్రశ్నించిన చాలామందికి కెసిఆర్ తెలంగాణ తెచ్చి…రైతుల మొహంలో చిరునవ్వును నింపి వారికి ధీటైన సమాధాన్ని చెబుతున్నాడని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం హన్మాజిపేట గ్రామంలో బుధవారం రైతు బంధు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, రైతులకు చెక్కులు, పట్టాపాస్ బుక్కులను అందజేశారు. ఈ సందర్భంగా హన్మాజిపేటలో సి.నారాయణరెడ్డి జ్ఞాపకార్థంగా రూ.30కోట్లతో నిర్మించతలపెట్టిన సినారె ఎగ్జిబిషన్‌కు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించా రు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ వస్తే ఏమస్తది అని ఎంతోమంది అన్నారని, తెలంగాణ వస్తే రైతులకు 24గంటల విద్యుత్, ఎరువులు,  పరిశీలన జరుగనుంది. 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 23 నగర పాలక సంస్థలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
విత్తనాలు సమయానుకూలముంగా అంది రైతుల మొహంలో చిరునవ్వు వస్తుందని, వీరి నవ్వే రాష్ట్ర అభివృద్ధికి చిహ్నమని అన్నారు. సినారె, మిద్దె రాములు వంటి గొప్ప ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళాకారులు పుట్టిన గడ్డకు రావడం తన అదృష్టమని అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమితులు రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేలా కృషి చేస్తుందని, కేంద్రప్రభుత్వం నుండి 25శాతం మద్దతు ధరను పొందేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కెసిఆర్ తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు. జాతీయ ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. దీనితో వ్యవసాయ కూలీల ఖర్చులు తగ్గి, రైతులకు లాభం చేకూరడంతో పాటు సంవత్సరానికి 365రోజుల పాటు కూలీలకు పని కల్పించవచ్చని అన్నారు. గత పాలకులు రైతులను రాబంధులుగా పీక్కుతింటే తమ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేసి బంధువులుగా చేరువయ్యామని అన్నారు. రైతు యూనిట్‌గా పంటలకు రూ.5లక్షల విలువ చేసే ఉచిత భీమా పథకాన్ని జూన్ 2నాటికి కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుందని, ఈ పథకం ప్రవేశంతో రైతులకు మరింత మేలు జరుగుతుందని, పంట నష్టపోయినా వారికి భీమాతో ధీమా కలుగుతుందని అన్నారు. దాశరతి అనే మహాకవి అప్పుడెప్పుడో అన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని…కాని ఇప్పుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం నా తెలంగాణ కోటి రతనాల వీణనే కాదు..కోటి ఎకరాల మాగాణి కూడా కావాలనే పట్టుదలతో గోదావరి, కృష్ణానదులలో ఉండే 12వందల టిఎంసిల మన తెలంగాణ వాట నీటితో ప్రతీ నీటి బొట్టును ఉపయోగించుకునేలా బీడు భూములకు మల్లించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళికలను చేస్తున్నారని అన్నారు. హన్మాజిపేట గ్రామ కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటిన మిద్దెరాములు, డా॥సినారె పుట్టిన ఈ గడ్డ కోసం తాను ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు హామి ఇచ్చారు. అనంతరం వేములవాడ శాసన సభ్యులు డా॥చెన్నమనేని రమేష్‌బాబు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన పది సంవత్సరాలలో ఎప్పుడూ చూడని అద్భుత పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టి, వాటి పనులను వేగవంతం చేయిస్తున్నారని అన్నారు. నీటిఆయోగ్ మిషన్ కాకతీయ పథకం అభినందించదగిందని అన్నారు. వచ్చే యాసంగికి గోదావరి జలాలను తెచ్చి తీరుతామని దీనితో ఈ ప్రాంత సాగు, తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌లు మాట్లాడారు. అనంతరం రైతులకు పట్టా పాస్‌బుక్కులను, రైతు బంధు చెక్కులను మంత్రి కెటిఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణానికి చెందిన దాదాపు వెయ్యి మందికిపైగా టిఆర్‌ఎస్ నాయకులు తమ ద్విచక్రవాహనాలపై తిప్పాపురం గ్రామం వద్ద మంత్రి కాన్వాయికి ఘనంగా స్వాగతం పలికి, హన్మాజిపేట వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. ఈ ర్యక్రమంలో జడ్పిటిసి గుడిసె శ్రీకాంత్, ఎంపిపి రంగు వెంకటేశంగౌడ్, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు తీగల రవీందర్‌గౌడ్, సెస్ డైరెక్టర్‌లు జడల శ్రీనివాస్, రామతీర్థపు రాజు, వేములవాడ నగర పంచాయతీ చైర్‌పర్సన్ నామాల ఉమ, డిఆర్‌ఓ శ్యామ్ ప్రసాద్‌లాల్, టిఆర్‌ఎస్ నాయకులు ఎర్రం మహేష్, పొలాస నరేందర్, గడ్డం హన్మాండ్లు, నిమ్మశెట్టి విజయ్, రాపెల్లి శ్రీధర్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, ఆరె సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సినారెకు నివాళి: మంత్రి కెటిఆర్ హన్మాజిపేట గ్రామానికి చేరుకోగానే మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా మంత్రి సినారె చిత్రపటం ముందు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సినారె రాజ్యసభసభ్యునిగా ఉన్న సమయంలో వేములవాడ నియోజక వర్గానికి చేసిన సేవలను గుర్తు చేశారు. అంతేకాకుండా ఆయన రచయితగా ఎందరినో ఆకట్టుకున్నారని, ఆయన కీర్తితో ప్రపంచంలోని నలుమూలాలకు హన్మాజిపేట గ్రామ ప్రతిష్టను పెంచారని అన్నారు.