Search
Saturday 22 September 2018
  • :
  • :

ఐఫోన్-8.. ధర రూ.లక్షకు పైనే..!?

Iphone-8

ఆపిల్ తన తర్వాతి ప్రాడెక్ట్ ఐఫోన్-8 విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. పలు విప్లవాత్మకమైన ఫీచర్లతో ఈ వారాంతంలో ఐఫోన్-8 మార్కెట్ లోకి రంగప్రవేశం చేయనుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ని స్మార్ట్ ఫోన్లకు పరిచయం చేసిన యాపిల్ ఐఫోన్-8లో ఆ ఫీచర్ ని తొలగించింది. దాని స్థానంలో 3డి టెక్నాలజీతో ముఖ క‌వ‌లిక‌ల ఆధారంగా గుర్తించే ఫీచ‌ర్‌ను యాడ్ చేశారు. ఇక ఈ ఫోన్ విడుదల కానుందనే వార్త ఐ ఫోన్ లవర్స్ లో ఎంతో ఆసక్తి రేపింది. దీనికి సంబంధించి పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రావడంతో ఫోన్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక ఐఫోన్-8 ధర ఎంత ఉండనుంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి వచ్చింది.

అయితే ఐఫోన్-8 ధర ఎంతో తెలిస్తే ముక్కన వేలేసుకోవాల్సిందే.. తాజాగా ఓ ఆంగ్ల వెబ్ సైట్ వెలువరించిన కథనం ప్రకారం ఐఫోన్-8 ధర దాదాపు 1199 డాలర్లు ఉండనుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.లక్షపైనే.. ఈ నెల 8న ఐఫోన్ 8 మార్కెట్ లోకి రానున్నట్లు సమాచారం. మూడు రకాల వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

ఐఫోన్‌ 8లో ఫీచర్లు (అంచన) : 

  • 5.8 అంగుళాల డిస్‌ప్లే
  • ఓలెడ్‌ స్క్రీన్‌
  • అత్యంత పలుచనైన బెజెల్స్‌
  • 3 జిబి ర్యామ్‌.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు
  • 12+12 ఎంపి డ్యూయల్ కెమెరాలు, 7 ఎంపి ముందు కెమెరా
  • 3డి ఫేస్‌ రికగ్నైజేషన్‌
  • ఐఒఎస్‌11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • వాటర్ ప్రూఫ్

Comments

comments