Home జాతీయ వార్తలు మోడీ మీకు సెల్యూట్ : కేజ్రీవాల్

మోడీ మీకు సెల్యూట్ : కేజ్రీవాల్

Arvind-Kejriwalన్యూఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. కాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. తరుచూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై విమర్శలు చేసే కేజ్రీవాల్ ఈ దాడుల నేపథ్యంలో మాత్రం ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులకు అంగీకారం తెలిపిన ప్రధాని మోడీకి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించడంపై ఆయన ధృడ నిశ్చయం మెచ్చకోదగినదని అన్నారు. చాలా అంశాల్లో మోదీతో తాను విభేదించినప్పటికీ ఈ విషయంలో మాత్రం మోదీకి సెల్యూట్ చేస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఆయన చేసిన పని సరైనదని, సర్జికల్ స్ట్రైక్స్ అంశంలో తాను మోడీకి పూర్తిగా మద్దతిస్తానని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాలు అసత్యమని నిరూపించాలని కేజ్రీవాల్ మోడీని కోరారు.

Video Courtesy : Sandesh News