Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

స్వాతిని అందరి ముందు కొట్టడం నేను చూశాను..!

Swathi-Murder-Caseచెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి పలు వివరాలు వెల్లడించారు. పట్టపగలు రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగా స్వాతిని హత్య చేసిన దాదాపు వారం రోజుల తర్వాత ఒకరు ముందుకొచ్చి మాట్లాడారు. స్వాతి హత్యకు కొద్దిరోజుల ముందే స్వాతిని ఓ వ్యక్తి కొట్టడం చూశానని డి.తమిళరసన్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. ఆయన స్వాతి ఉండే ప్రాంతంలోనే ఉంటున్నారు. అయితే సిసిటివి ఫుటేజీలోని వ్యక్తి.. అంతకుముందు స్వాతిని కొట్టిన వ్యక్తి ఒక్కరే కాదని చెప్పారు. జూన్ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో స్వాతిని గుర్తుతెలియని వ్యక్తి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
హత్య జరిగిన సమయంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌కు కొంచెం దూరంలో ఉన్నానని తమిళరసన్ తెలిపారు. తాను అక్కడికి వెళ్లేసరికి స్వాతి చనిపోయిందని చెప్పారు. ఈ హత్యతో తాను చాలా షాక్‌కు గురయ్యానని.. తర్వాత రైల్లో అక్కడి నుంచి వెళ్లిపోయానని వెల్లడించారు. స్వాతిని అంతకుముందు నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లోనే ఓ వ్యక్తి 4, 5 సార్లు చెంపదెబ్బలు కొట్టాడని.. ఈ విషయం ఎవరితోనైనా చెప్పడానికి భయపడ్డానని అన్నారు. స్వాతి హత్య కేసులో చెన్నై పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫొటో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

comments