Home తాజా వార్తలు నాకు యాక్షన్ సినిమాలు చేయాలనే ఉంది…

నాకు యాక్షన్ సినిమాలు చేయాలనే ఉంది…

 Varun Tejటాలీవుడ్ లో యువ హీరోలు ఎక్కువగా లవ్ అండ్ యాక్షన్ సిన్మాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం అందుకు భిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. ‘కంచె’.. ‘ఫిదా’ ఇలా విభిన్నమైన కథా సినిమాలను ఈ కుర్ర హీరో ఎంచుకుంటూ వస్తున్నాడు. ‘అంతరిక్షం’ సినిమాలో ఆయన వ్యోమగామిగా కనిపించబోతున్నాడు. ఈ సిన్మాను డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడాడు.

మిగతా యంగ్ హీరోల లాగానే నాకు కూడా యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది. గాల్లోకి ఎగిరిపడుతూ రౌడీలతో ఫైట్ చేయాలని ఉంటుంది. సంకల్ప్ రెడ్డి నుంచి అలాంటి కథనే ఆశించాను, కానీ ఆయన ఈ కథ చెప్పి.. కాదనకుండా చేశాడు. ఈ సినిమాలోని పాటలు, కామెడీ సీన్స్ పెట్టొచ్చు. కానీ సంకల్ప్ రెడ్డి కథను పట్టుగా నడిపించడంపైనే దృష్టి పెట్టాడు. కచ్చితంగా ఈ సిన్మా నా కెరియర్లోనే ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

I want to do Action Films Says Varun Tej