Search
Sunday 23 September 2018
  • :
  • :

మణిరత్నం, శంకర్ డైరెక్షన్‌లో చేయాలనుంది

kajal

‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మరింత పాపులారిటీని తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం తమిళంలో అజిత్‌తో ‘వివేగం’, విజయ్-అట్లీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. మొన్ననే తన పేరు మీద ఒక పర్సనలైజ్డ్ యాప్‌ను లాంచ్ చేసిన కాజల్ భవిష్యత్తులో తాను చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్‌ల గురించి ఆసక్తికర విషయాలను తెలియజేసింది. “నా కెరీర్‌లో ‘మగధీర’ చిత్రంలో మిత్రవింద, ‘దో లఫ్జోన్‌కీ కహాని’లో జెన్నీ, ‘తుపాకి’లో నిషా, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’లో ప్రియా పాత్రలు చాలా బెస్ట్‌గా నిలిచాయి.

అలాగే భవిష్యత్తులో యాక్షన్ ఓరియెంటెడ్, ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ చేయాలనుంది. గ్రేట్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయాలనేది నా కోరిక. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల మీద ఎక్కువగా దృష్టి పెట్టాను. ప్రస్తుతం తమిళ్‌లో ‘వేవేగమ్’, తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలు చేస్తున్నాను. ఈ  చిత్రాల్లో నా పాత్రలు చాలా బలంగా ఉంటాయి. దర్శకులు నా పాత్రలను గొప్పగా డిజైన్ చేశారు”అని కాజల్ వివరించింది.

Comments

comments