Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

విరాట్‌తో డేట్‌కి వెళ్లాలని ఉంది : ప్రాచీ

Virat-Prachiముంబయి : అద్భుతమైన ఆటతీరుతో పాటు తన లైఫ్‌స్టైల్‌తో ఎందరో అమ్మాయిల మనసు దోచుకున్నాడు విరాట్ కోహ్లీ. బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుని యూత్‌కు ఐకాన్‌గా మారిపోయాడు. బాలీవుడ్ హీరోయిన్లు సైతం అతడితో డేట్‌కు వెళ్లాలని అశపడుతున్నారంటే అతడి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
‘విరాట్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను అతడిని ప్రేమిస్తున్నా. దీనిపై అనుష్క ఏమనుకున్నా నాకు సంబంధం లేదు’ అంటూ కొద్దిరోజుల క్రితం ఐటెం గర్ల్ రాఖీసావంత్ బహిరంగంగా కామెంట్ చేసింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ కూడా కోహ్లిపై మనసు పారేసుకుంది. అతడితో డేటింగ్‌కు వెళ్లాలని ఉందంటూ ‘అజర్’ ప్రచార కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో అందగత్తె నర్గిస్ ఫక్రి.. సచిన్‌తో డిన్నర్ చేయాలని తన ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ ‘అజర్’ చిత్రంలో ఇమ్రాన్ హష్మికి జంటగా నటించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments