Home సినిమా 30 ఏళ్ల లోపే పెళ్లి

30 ఏళ్ల లోపే పెళ్లి

aliya

బాలీవుడ్ హీరో రణబీర్‌కపూర్‌తో యంగ్ బ్యూటీ అలియాభట్ రొమాన్స్ చేస్తోందని గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి ప్రేమాయణం జోరుగా కొనసాగుతోందట. ఇక గతంలో కత్రినాతో ప్రేమాయణాన్ని నడిపించి ఆమెతో సహజీవనం చేశాడు రణబీర్. పెళ్లే తరువాయి అనుకున్న దశలో వాళ్లిద్దరూ విడిపోయారు. అంతటితో ఆ కథ ముగిసింది. ఇప్పుడు రణబీర్ కపూర్ అందాల తార అలియాతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ విషయం గురించి సూటిగా స్పందించకుండా తాను తొందరగానే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అలియాభట్. చాలా మంది హీరోయిన్లు పెళ్లి అనగానే అప్పుడేనా అంటూ ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్లు ఎవరూ యుక్త వయసులో పెళ్లి చేసుకున్న దాఖలాలు లేవు. అయితే అలియా మాత్రం తాను త్వరగానే పెళ్లి చేసుకుంటానని అంటోంది. 30 ఏళ్ల వయసులోపే తన పెళ్లి ఉంటుందని ఈ హీరోయిన్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఆమె వయసు 25 ఏళ్లు. ఇక ‘రాజి’ సినిమా హిట్‌తో అలియాభట్ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది.