Home తాజా వార్తలు సమంత నటనంటే ఇష్టం

సమంత నటనంటే ఇష్టం

నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మజిలీ’. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ.. “మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబయ్‌లో ఉంటున్నాను. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత అవకాశాల కోసం ఎదురుచూశాను. ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. అలా ఆడిషన్స్‌లో ‘మజిలీ’ సినిమాకు ఎంపికయ్యాను. అయితే తమిళ్‌లో సిద్ధార్థ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది మే లేదా జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగులో మాత్రం ‘మజిలీ’ నా తొలి చిత్రం.

ఈ చిత్రంలో నా పాత్ర పేరు అన్షు. చైతన్యను ప్రేమించే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. చైతన్యతో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. దర్శకుడు శివ నిర్వాణ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతోనే బాగా నటించాను. తెలుగులో చైతన్య, సమంతతో కలిసి ఈ చిత్రంలో నటించడంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే వారు పెళ్లి తర్వాత జంటగా నటించిన తొలి చిత్రమిది. ‘మజిలీ’ ఫ్యామిలీ డ్రామా. దర్శకుడు సినిమాను అద్భుతంగా మలిచారు. ఈ సినిమాలో నా పాత్ర తీరుతెన్నులు, పాత్ర గ్రాఫ్ నాకు నచ్చింది. అందుకనే ఇందులో నటించాను. ఇకముందు కంటెంట్ ఉన్న సినిమాలే కాదు గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బాలీవుడ్‌లో అలియాభట్, కరీనాకపూర్, అనుష్కశర్మలను ఇష్టపడతాను. ఇక్కడ సమంత నటనంటే ఇష్టం”అని తెలిపారు.

 I will like Samantha Acting: Divyansha Koushik