Home స్పెషల్ ఆర్టికల్స్ ‘నాన్న జీవితంపై సినిమా తీస్తా : అందులో నేనే నటిస్తా!’

‘నాన్న జీవితంపై సినిమా తీస్తా : అందులో నేనే నటిస్తా!’

Balakrishna-NTR-Movieహైదరాబాద్ : నందమూరి అభిమానులకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీపి కబురు అందించారు. ప్రముఖ సినీ నటుడు, దివంగత ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై త్వరలో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్‌టిఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో ఆయన నారా లోకేశ్‌తో కలిసి పర్యటించారు. అక్కడ 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆయన చేశారు. ఎన్‌టిఆర్ జీవితంపై సినిమాపై పరిశోధన జరుగుతోందని, త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని తెలిపారు. కాగా ఎన్‌టిఆర్ పాత్రలో ఆయనే నటిస్తానని చెప్పారు. అంతేకాక ఎన్‌టిఆర్ జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తన పిఎపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని, పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.