Search
Friday 16 November 2018
  • :
  • :

కిమ్‌తో మాట్లాడుతా

Presidnetsవాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌తో ఫోన్లో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ అన్నారు. ఉ.కొరియా వరుస క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో కొద్ది రోజులుగా ట్రంప్, కిమ్ మధ్య మాట ల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ శనివారం మేరీల్యాండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్ తో మాట్లాడుతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు తప్పకుండా మాట్లాడుతా అని సమాధానమిచ్చారు. ‘నాకు ఆయనతో మాట్లాడటంలో ఎలాం టి అభ్యంతరం లేదు. కాకపోతే అందుకు కొన్ని షరతులు ఉంటాయి. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో ద.కొరియా, ఉ.కొరియా మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇది నిజంగా చాలా గొప్పవిషయం.నేను కలగజేసుకోపో యి ఉంటే ఆ ఇరు దేశాల మధ్య ఎప్పటికీ చర్చలు జరిగేవి కావు. చర్చలు ఫలిస్తే ప్రపంచానికే అది శుభవార్త’ అని వ్యాఖ్యానించారు. ఉ.కొరియా, దక్షిణ కొరియా ప్రతినిధులు రెండేళ్ల అనంతరం మొదటిసారిగాఈ నెల 9న సమావేశం కానున్నారు. చర్చల కోసం సియోల్ పంపిన అభ్యర్థనకు ప్యాం గ్యాంగ్ అంగీకారం తెలపడంతో ఈసమావేశాలకు మార్గం సుగమమైంది. అమెరికా, ద.కొరియా నిర్వహించే సంయుక్తం సైనిక విన్యసాలు వాయిదా పడిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం ఖరారు కావడం గమనార్హం.
పాక్‌ను చైనా ఒప్పించాలి – అమెరికా : తమ దేశంలో ఉన్న ఉగ్రవాద సురక్షిత స్థావరాలను ధ్వం సం చేసేలా పాకిస్థాన్‌ను చైనా ఒప్పిస్తుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. ఆదివారం వైట్ హౌజ్ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద సురక్షిత స్థావరాలను ధ్వంసం చేస్తే , అఫ్ఘనిస్థాన్‌తోపాటుఈప్రాంతంలో సుస్థిరత నెలకొంటుందని తెలిపారు. పాక్‌తో చైనాకు చారిత్రక సంబంధాలు ఉన్నాయని, అనేక ఏళ్లుగా ఇరు దేశాల మధ్యసైనిక సన్నిహిత సంబంధాలు ఉన్నాయ న్నారు. వారి మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యాయని, చైనా, పాక్ ఎకనామిక్ కారిడర్‌ను(సిపిఇసి)ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఉగ్రవాద సమస్యపై అమెరికా ఆందోళనను చైనా అర్థం చేసుకొ గలదని పేర్కొ న్నారు. ఈ సమస్యను ప్రాంతీయంగా ఎదుర్కొనేందుకు ఇతర దేశాలతో కలిసి పని చేస్తామని, సమస్య పరిష్కారంలో చైనా కీలక పాత్ర పోషిం చాలన్నారు అప్ఘన్, పాక్‌ల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంలో చైనా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. పాక్‌లో ఉగ్రస్థావరాలు ఉన్నంత వరకు చైనా ప్రయోజనాలు నెరవేరబోవన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడం చైనాకు కూడా అవసరమని పేర్కొన్నారు. తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్, ఉగ్రవాద కీలక స్థావరాలను ధ్వంసం చేయడంలో పాక్ విఫలమైందన్నారు.

Comments

comments