Home జాతీయ వార్తలు భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు: మాల్యా

భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు: మాల్యా

Big shock to Vijay Mallya in the London court!

లండన్: బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించాలన్న అంశంపై బ్రిటన్ న్యాయస్థానం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మాల్యా 5 పేజీల పత్రికా ప్రకటనను విడదల చేశారు. 2016లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీలకు ఈ వివాదానికి సంబంధించి లేఖలు రాశానని మాల్యా పేర్కొన్నారు. రుణ ఎగవేతకు సంబంధించి బ్యాంకులతో ఒక అంగీకారానికి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా భారత్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు.కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదంటూ ఉద్దేశపూర్వకమైన ఎగవేతదారుగా తన పేరు ప్రకటించినట్లు తెలిపారు.బ్యాంకులతో అంగీకారం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అయితే తనపై అసత్య ప్రచారం జరుగుతుందని, దీంతో ఏం చేయాలో తెలియడం లేదన్నారు. తనపై అకారణంగా ఈడి, సిబిఐలు ఛార్జీషీటులు వేస్తున్నాయని మాల్యా ఈ ప్రకటనలో ఆరోపించారు.