Search
Monday 24 September 2018
  • :
  • :

భారత్‌కు ఇదే మంచి అవకాశం: ఇయాన్‌ చాపెల్‌

Ian Chappell feels that India have the best opportunity to win Series

సిడ్నీ: ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవడానికి భారత్‌కు ఇదే సువర్ణ అవకాశమని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌ తెలిపారు. జూలైలో విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్ తన పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌తో మూడు టీ20, ఐదు వన్డే, నాల్గు టెస్టులు ఆడనుంది. జులై 3 నుంచి ఇరు దేశాల మధ్య జరిగే టీ20 సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌ మంగళవారం మాట్లాడుతూ…‘ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారని ఆయన పేర్కొన్నారు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు సమిష్టిగా రాణిస్తే టీమిండియాదే విజయమని చాపెల్ అన్నారు.

ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కు ఇదో మంచి అవకాశమని ఆయన చెప్పారు. ఇటీవల లార్డ్స్‌ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో ఒత్తిడిని తట్టుకోలేక ఇంగ్లండ్‌ పరాజయం పాలైన విషయాన్ని ఈ సందర్భంగా ఇయాన్ ప్రస్తావించారు. అలాగే ఓపెనర్‌ కుక్‌ ఫామ్ లేమితో ఇంగ్లండ్‌ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నాడని, దీంతో ఆ జట్టుకు ఈ మధ్య కాలంలో శుభారంభమే దక్కడం లేదన్నాడు. దీన్ని టీమిండియా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. భారత బౌలర్లు ఇంగ్లిష్‌ మిడిలార్డర్‌ను దెబ్బకొడితే వారు తేరుకోవడం కష్టం’ అని చాపెల్‌ అభిప్రాయపడ్డారు.

Comments

comments