Home కరీంనగర్ రాజన్న సేవలో ఐఎఎస్ అధికారి

రాజన్న సేవలో ఐఎఎస్ అధికారి

rajannaవేములవాడ: ఐఎఎస్ అధికారి, హౌజింగ్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె రవికుమార్ న్యూఢిల్లీ వారు శ్రీరాజరా జేశ్వర స్వామివారి సేవలో ఆదివారం తరించారు. రాజన్నను దర్శించుకునేం దుకు వేములవాడకు వచ్చిన ఆయనను ముందుగా జిల్లా మేయర్ రవీందర్‌సింగ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికా రు. అనంతరం ఐఎఎస్ అధికారి రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కల్యాణమండపంలో అర్చకులు ఆశీర్వచనం గావించగా పిఆర్ ఒ తిరుపతిరావు శ్రీ స్వామివారి ప్రసా దాన్ని అందజేశారు.