Home జాతీయ వార్తలు పిఎస్‌లో యువకుడిని చితకొట్టిన కలెక్టర్..!(వీడియో)

పిఎస్‌లో యువకుడిని చితకొట్టిన కలెక్టర్..!(వీడియో)

Nikhil Nirmalకోల్‌కతా: తన భార్యపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఓ యువకుడిని పోలీసు స్టేషన్ కు పిలిపించి చితకొట్టాడు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఐఎఎస్ అధికారి, అలీపుర్ దౌర్ జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్) నిఖిల్ నిర్మల్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు చూస్తుండగానే నిఖిల్ దంపతులు యువకుడిని అతి దారుణంగా కొట్టి హింసించారు. ఆ యువకుడు తనను క్షమించాలని ప్రాధేయ పడిన నిఖిల్, ఆయన సతీమణి కనికరించలేదు. పైగా మీ ఇంటికి వచ్చి నిన్ను చంపుతానంటూ యువకుడిని బెదిరించారు కలెక్టర్. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో పోలీసు చిత్రీకరించినట్టు సమాచారం. ఇప్పుడు వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతుండగా, కలెక్టర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఓ ఐఎఎస్ ఆఫీసర్ ఇలా రౌడీలా ప్రవర్తించడం ఏమిటని దుమ్మెత్తిపోస్తున్నారు. యువకుడిని కొట్టిన కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కేరళకు చెందిన నిఖిల్ నిర్మల్ 2011 బెంగాల్ కేడర్ ఐఎఎస్ ఆఫీసర్.

IAS officer Nikhil Nirmal thrashes youth